తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్ విభాగానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 2న ప్రారంభమైంది. అగ్రికల్చర్‌ విభాగంలో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మా-డి తదితర సీట్లను కేటాయించేందుకు ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అభ్యర్థులు సెప్టెంబరు 2, 3 తేదీల్లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్  పూర్తయిన అభ్యర్థులు సెప్టెంబరు 4 నుంచి 7 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్న విద్యార్థులకు సెప్టెంబరు 11న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు.


➔ ఇక చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 17 నుంచి 25 వరకు కొనసాగనుంది. సెప్టెంబరు 24న స్పాట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూలును విడుదల చేయనున్నారు.


➔ ఈ ఏడాది అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 1,10544 మంది పరీక్ష రాయగా, 91,935 మంది విద్యార్థులు (86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొత్తం అయిదు రకాల కోర్సుల్లో 8,312 సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయనున్నారు. 


తొలి దశ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ స్లాట్‌ బుకింగ్‌: సెప్టెంబరు 2, 3 తేదీల్లో


➥ ధ్రువపత్రాల పరిశీలన: సెప్టెంబరు 4, 5 తేదీల్లో


➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: సెప్టెంబరు 4 నుంచి 7 వరకు  


➥ ఆప్షన్ల ఫ్రీజింగ్: సెప్టెంబరు 7 


➥ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 11


➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: సెప్టెంబరు 11-14 మధ్య


చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ స్లాట్‌ బుకింగ్‌: సెప్టెంబరు 17న


➥ ధ్రువపత్రాల పరిశీలన: సెప్టెంబరు 18.


➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: సెప్టెంబరు 17 నుంచి 19 వరకు  


➥ ఆప్షన్ల ఫ్రీజింగ్: సెప్టెంబరు 19


➥ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23


➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: సెప్టెంబరు 23-25 మధ్య


స్పాట్ కౌన్సెలింగ్ మార్గదర్శకాల వెల్లడి: సెప్టెంబరు 24.


Counselling Notification


Counselling Website


Pay Processing Fee


Verify Payment Status


Slot Booking


ALSO READ:


GATE: 'గేట్‌-2024' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమైంది. సెప్టెంబరు 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌తో అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేపర్‌ను ప్రవేశపెట్టారు. పరీక్షలను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో నిర్వహించనున్నారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
గేట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీకి మార్గం 'జామ్', పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభంకానుంది. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..