Horoscope Today 02 September 2023


మేష రాశి
ఈ రాశివారు పనిచేయండి..ఫలితాన్ని ఆశించవద్దు.  నీ ఇష్టాలను, అభిప్రాయాలను ఇతరులపై రుద్దకూడదు. ఇంటి సమస్యలను ఇతరుల ముందు చెప్పడం అంత మంచిదికాదని గుర్తించండి. వాతావరణంలో మార్పులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు తమ పనులప పట్ల అంకితభావంతో ఉంటారు.


వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిరోజు. విద్యార్థులు పోట పరీక్షలలో అద్భుతమైన విజయం సాధించే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. 


మిధున రాశి
ఈ రాశివారి జీవితంలో ఈ రోజు సానుకూలమైన మార్పులు వస్తాయి. పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది.  వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులకు శుభసమయం. 


కర్కాటక రాశి
ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో పరస్పర సామరస్యం తగ్గవచ్చు. మార్కెటింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు పదాలు జాగ్రత్తగా వినియోగించాలి. భారీ ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. 


Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6 or 7 - ఎప్పుడు జరుపుకోవాలి!


సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ మాటలు మీ సన్నిహితులను నొప్పిస్తాయి. కుటుంబ సభ్యులతో కొంచెం సున్నితంగా వ్యవహరించాలి. ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.


కన్యా రాశి
ఈ రాశివారు తాము సాధించిన విజయాలు చూసి గర్వపడతారు. వైవాహిక జీవితం బావుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మేధావుల సహవాసం వల్ల ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగులు,వ్యాపారులకు శుభసమయం.


తులా రాశి
తులా రాశివారు కాస్త ఓపికగా వ్యవహరించాలి. అనుకున్న పనులన్నీ పెండింగ్ పడతాయి.  ఆదాయ-వ్యయాల మధ్య సమతుల్యత పాటించాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్యమైన అంశాల గురించి చర్చ జరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 


వృశ్చిక రాశి 
ఈ రాశివారు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. పిల్లలపై ఆగ్రహం ప్రదర్శించకుండా ప్రేమగా వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితులు, సన్నిహితుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. ఈ రాశి ఉద్యోగుల పట్ల అధికారుల ప్రతికూల వైఖరి ఉండొచ్చు. 


ధనుస్సు రాశి 
ఈ రాశివారు ఈ రోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఉద్యోగులు సబార్డినేట్స్ తో సరదా స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ గత అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు పక్కాగా వేసుకుంటారు. 


Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది


మకర రాశి
ఈ రాశివారికి స్నేహితుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కాస్త ఓర్పుగా వ్యవహరించడం మంచిది. సంయమనంతో పనిచేయాలి. ఉద్యోగులు, వ్యాపారులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులు చదువుపై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాలి


కుంభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీ సలహాలు, సూచనలు ఇతరులకు ఉపయోగపడతాయి. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త. 


మీన రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మీ ప్రత్యేకతను చాటుకుంటారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. కెరీర్లో మరో అడుగు ముందుకేసేందుకు ఇదే మంచిసమయం. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు.