TS EAMCET Counselling: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 21న ప్రారంభమైంది. ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంసెట్  తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు 21 నుంచి 29 వరకు స్లాట్  బుక్  చేసుకోవచ్చు. అభ్యర్థులు తాము ఏ రోజు, ఏ సమయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వస్తారో తెలుపుతూ వెబ్‌సైట్  ద్వారా స్లాట్ బుక్  చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకునే అభ్యర్థులు కౌన్సెలింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.


Also Read: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్యమైన తేదీలు ఇవే!


ఆ విషయంలో ఆందోళన వద్దు...
ఎంసెట్  దరఖాస్తు సమయంలో కొందరు అభ్యర్థులు పొరపాటున నాన్-లోకల్  అని నమోదు చేసుకున్నా.. ధ్రువపత్రాల సమయంలో స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా లోకల్, నాన్-లోకల్ వివరాలను ధ్రువీకరించనున్నారు. విద్యార్థులు 6 నుంచి 12వ తరగతి వరకు ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ రాష్ట్రాన్ని లోకల్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు 6 - 9 తరగతులు తెలంగాణలో చదివి, మిగిలిన మూడేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదివినా.. వారు తెలంగాణ లోకల్ కిందకే వస్తారు. సీట్లు కేటాయించేటప్పుడు తొలుత 15% అన్ రిజర్వుడ్  సీట్లను భర్తీ చేస్తారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 23 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జేఎన్ టీయూహెచ్  అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో  ఆప్షన్ల ప్రక్రియ సకాలంలో మొదలవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.


స్లాట్ బుకింగ్ ఇలా చేసుకోండి..


అభ్యర్థులు స్లాట్ బుకింగ్ కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://tseamcet.nic.in/


అక్కడ హోంపేజీ మెనూలో కనిపించే Slot Booking  ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


క్లిక్ చేయగానే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ పేజీ ఓపెన్ అవుతుంది.


అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.


అక్కడ హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి Show Available Slots ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


ఆ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం ఏరోజు, ఏ సమయానికి వచ్చేది నమోదుచేయాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్ ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది.


TS EAMCET 2022 స్లాట్ బుకింగ్ కోసం కోసం క్లిక్ చేయండి..


అయోమయానికి గురికావొద్దు..


కౌన్సెలింగ్ ప్రక్రియలో అభ్యర్థులు ఎలాంటి అయోమయానికి గురికావద్దు. ఎందుకంటే ఆప్షన్ల ప్రక్రియలో ఒకవేళ కళాశాలల పేర్లు.. కోడ్‌లు ఒకేరకంగా ఉంటే నమోదులో అయోమయానికి గురైతే మంచి కళాశాలకు బదులు నాసి కళాశాలలో సీటు వచ్చే ప్రమాదం ఉంది. బీటెక్  సీఎస్ ఈ బదులు పొరపాటుగా సీఎస్‌సీ అని ఆప్షన్  ఇస్తే సైబర్  సెక్యూరిటీలో సీటు రావొచ్చు. ఉత్తమ ర్యాంకు వచ్చినా పొరపాట్ల కారణంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. మూడు విడతల ఎంసెట్  కౌన్సెలింగ్  జరుగుతుంది కదా.. అని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే తొలి విడత కౌన్సెలింగ్‌తోనే జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే కళాశాలలు, వాటి ఎంసెట్ కోడ్‌లు, ఆసక్తి ఉన్న కోర్సులు, వాటి కోడ్‌లను వెబ్‌సైట్‌లో ఉన్న మాన్యువల్  ఆప్షన్  ఎంట్రీ ఫాంపై రాసుకొని ఆప్షన్లు నమోదు చేసుకోవడం ఉత్తమం.


Also Read: ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం:



  • ఎంసెట్ హాల్ టికెట్

  • ఆధార్ /పాన్ కార్డు/డ్రైవింగ్  లైసెన్స్  తదితర ఒక గుర్తింపు కార్డు

  • ఎంసెట్ ర్యాంకు కార్డు

  • ఇంటర్ మార్కుల పత్రం

  • టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్)

  • పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో.

  • 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్

  • రిజర్వేషన్ వర్తిస్తే కుల ధ్రువీకరణ పత్రం

  • ఈడబ్ల్యూఎస్ వర్తిస్తే ఆ ధ్రువపత్రం


Also Read: NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ కోటా కింద పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో పీజీ మెడికల్, పీజీ డెంటల్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఈ కోర్సులకు ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ అర్హతతోపాటు నీట్-పీజీ 2022/ నీట్ ఎండీఎస్ 2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పీజీ మెడికల్ కోర్సులకు 31.05.2022 నాటికి, పీజీ డెంటల్ కోర్సులకు 31.03.2022 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.7,080 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,900 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read: NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలోని పారా మెడికల్  కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న  నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..