Pawan Kalyan :జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రజల వద్దకు నేరుగా వెళ్తూ వారి సమస్యనలు తెలుసుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు జనసేన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వరకు మూడు సార్లు నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చెప్పుకున్నారు. తాజాగా జనవాణి కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నారు.
భారీ సంఖ్యలో తరలివస్తున్న ప్రజలు
తిరుపతి జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతికి చేరుకున్న ఆయన జీఆర్‌ఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగితెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశాయి జనసేన శ్రేణులు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని ప్రజలు ఈ జనవాణి కార్యక్రమానికి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు జనవాణిలో తమ సమస్యలు చెప్పుకోడానికి తరలివస్తున్నారు. జనవాణి కార్యక్రమానికి ఇప్పటికే విజయవాడలో రెండు దఫాలుగా, భీమవరంలో ఒకసారి నిర్వహించారు.
కడపలో కౌలు రైతు భరోసా యాత్ర
కుల, మతాలతో రాజకీయం చేస్తే దేశం విచ్చిన్నం అవుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో రైతు భరోసా యాత్రలో పవన పాల్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సాయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సిద్ధులు తిరిగిన ప్రాంతం రాయలసీమ అని ఇక్క పేదరికం రాజ్యమేలుతోందన్నారు. పేదరికానికి కులం లేదు. బాధిత కౌలు రైతు కుటుంబాల్లో రెడ్లే అధికం. కౌలు రైతులకు సరిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదన్నారు. ఉపాధి లేకుంటే చదువుకున్న యువత ఏం చేయాలి. రాయలసీమ చదువుల నేల.. పద్యం పుట్టిన భూమి. ఇంటింటికీ చీప్ లిక్కర్ వచ్చిందని యువత చెబుతున్నారన్నారు.
కౌలు రైతులకు కార్డులు ఇవ్వడం లేదు !
రైతులను ఉద్ధరిస్తున్నట్టు, కౌలు రైతులను ఆదుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదంతా కష్టపడినా చేతికాడ ముద్ద నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. పంటలు దెబ్బతింటే ప్రభుత్వమిచ్చే పథకాలు కౌలు రైతుల దరి చేరడంలేదు. వెరసి పంటలు సాగు చేయలేక కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒకరిద్దరు కాదు.. మూడేళ్ల వ్యవధిలో ఉమ్మడి కడప జిల్లాలో 175 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. 2019 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒక్కరు కూడా కౌలు రైతు లేరని.. అంటే లెక్కలు సరిగ్గా వేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని కనీసం సాగు పెట్టుబడులు రాని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మాభిమానం చంపుకోలేక పలువురు రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు.
Also Read : AP Govt : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, బీసీ జాబితాలోకి మున్నూరు కాపులు!
Also Read : Tirumala News : తిరుమలలో సాధారణ స్థితికి భక్తుల రద్దీ, ఆదివారం శ్రీవారి పూజలు ఇవే!