TS EAMCET 2022 Application Process Begins: తెలంగాణ ఎంసెట్ 2022 అధికారిక నోటిఫికేషన్ ఇటీవల విడుదల కాగా, నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఇంట‌ర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, మెడిక‌ల్ కోర్సులో చేరేందుకు ఎంసెట్ పరీక్ష (TS EAMCET 2022 Exam) రాయాల్సి ఉంది. ఈ ఏడాది ఎంసెట్‌ను హైద‌రాబాద్‌ జేఎన్‌టీయూ (JNTU Hyderabad) నిర్వహిస్తోంది. మార్చి 28న తెలంగాణ ఎంసెట్ 2022 నోటిఫికేషన్ విడుదల కాగా, ఏప్రిల్ 6వ తేదీ నుంచి Telangana EAMCET 2022 దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుందని ఉన్నత విద్యా మండలి ఇటీవల స్పష్టం చేసింది. 


పరీక్షల తేదీలివే..
టెక్నాలజీ, ఇంజినీరింగ్(Engineering Courses) కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌డానికి అభ్యర్థులు ఇంటర్ లో మ్యాథ‌మెటిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యోటెక్నాల‌జీ, బ‌యోల‌జీ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షన‌ల్, ఒకేష‌న‌ల్ కోర్సుల పాస్ అయి లేదా డిప్లొమా చివ‌రి ఏడాది చ‌దువుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఎంసెట్ అగ్రిక‌ల్చర్(Agriculture), మెడిక‌ల్ పరీక్షను జూన్ 14, 15వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ పరీక్షను జూన్‌ 18, 19, 20వ తేదీల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు.


ఫీజు వివరాలు..
ఎంసెట్ దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ఎంసెంట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్లు రూ. 400 చెల్లించాలి. మిగ‌తా కేట‌గిరీల అభ్యర్థులు రూ. 800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్(SC, ST, PH) అభ్యర్థులు రూ. 800, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. తెలంగాణ ఎంసెట్ 2022 పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/ ను సందర్శించాలి.


TS EAMCET 2022 దరఖాస్తు ప్రక్రియ ఇదే..  



  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌  https://eamcet.tsche.ac.in/ కు వెళ్లాలి.

  • ఆ సైట్ హోం పేజీలో కనిపించే ఆన్‌లైన్ అప్లికేషన్ విభాగం కింద Pay Registration Fee లింక్‌పై క్లిక్ చేయాలి.

  • ఓపెన్ అయిన పేజీలో Candidate's Name, Date of Birth, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, కాస్ట్ వివరాలు సబ్మిట్ చేయాలి.  తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

  • Fill Online Application మీద క్లిక్ చేయాలి. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, ఇంటర్ సెకండియర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ వివరాలు ఇచ్చి, Proceed To Fill Application మీద క్లిక్ ఇవ్వండి.

  • అప్లికేషన్‌లో మీ వివరాలు అన్ని ఫిల్ చేసి, అడిగిన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాలి 

  • సబ్‌మిట్‌ చేసేముందు అన్ని వివరాలు చెక్‌ చేసుకుంటే సరి. మీరు ఫిల్ చేసిన వివరాలను చివర్లో పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి. వీలైతే ప్రింటౌట్ తీసుకోవాలి


Also Read: TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష తేదీలివే? 


Also Read: NEET UG 2022: ఏప్రిల్‌ 10న నీట్‌ నోటిఫికేషన్! జులైలో ఎగ్జామ్‌