TS CPGET 2022 Latest News:  తెలంగాణలో నిర్వహించనున్న కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఏ డిగ్రీ పాసైన విద్యార్తులైనా ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన ఉపకులపతులతో (Vice Chancellor Of Universities In Telangana) ఉన్నత విద్యా మండలి సోమవారం భేటీ అయింది. వచ్చే విద్యా సంవత్సరంలో పీజీ కోర్సులలో మార్పులపై స్పందించారు.


ఈ ఏడాది సైతం ఓయూకే బాధ్యతలు.. 
ఈ ఏడాది నిర్వహించనున్న కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 ( Telangana CPGET 2022) నుంచి పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా వారికి ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందే అవకాశం కల్పించారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది సైతం కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టు నిర్వహణ బాధ్యలు ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మే నెలాఖరుకల్లా టీఎస్ సీపీజీఈటీ 2022 (TS CPGET 2022 Notification) నోటిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు.






ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జీరో అడ్మిషన్లు (Decision On Zero Admission Colleges) నమోదైన కాలేజీలు, కోర్సులను రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఓ కోర్సులో 15 మంది కంటే తక్కువ విద్యార్థులు అడ్మిషన్ పొందితే వారిని ఇతర కోర్సులకు ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా వారిని డిస్టెన్స్‌ (Distance Education)లో చదివే అవకాశం కల్పించాలని వర్సిటీల వీసీలకు ఉన్నత విద్యా మండలి సూచించింది.


 Also Read: TS SSC Hall Ticket 2022: టెన్త్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు వచ్చేశాయ్ - రెండు విధాలుగా పొందవచ్చని తెలుసా ! డైరెక్ట్ లింక్


Also Read: TSSPDCL Recruitment 2022: టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో 1271 ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల - అర్హత, దరఖాస్తు ఇలా