తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, 2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని 27 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.



కోర్సు వివరాలు:

* మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫీమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సు


మొత్తం సీట్ల సంఖ్య: 1,020 

➥ ప్రభుత్వ విద్యా సంస్థల్లో: 180 సీట్లు. 

➥ ప్రైవేట్ విద్యా సంస్థల్లో: 840 సీట్లు.

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు ఫీజు: రూ.200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు.. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2023.


➥ సంబంధిత ప్రిన్సిపల్స్‌కు దరఖాస్తుల సమర్పించడానికి చివరితేది: 21.10.2023.


➥ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేతేది: 31.10.2023.


➥ తరగతుల ప్రారంభం: 01.11.2023.


Notification (Government Institutions)


Notification (Private Institutions)


Online Application


Website


ALSO READ:


నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆంధ్రా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ 2023-24 విద్యా సంవత్సరానికిగాను మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెల్ఫ్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్స్ కింద ఈ సీట్లను భర్తీచేయనున్నారు. ఈ కోర్సులను డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నిర్వహిస్తుంది. మూడేళ్ల లా డిగ్రీ కోర్సుకు డిగ్రీ అర్హత, అయిదేళ్ల లా డిగ్రీ కోర్సుకు ఇంటర్ అర్హత ఉండాలి. వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్‌' తప్పనిసరి, మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ
దేశంలో 'ఇండియా స్కిల్ రిపోర్ట్ (ఐసెఆర్)-2022' నివేదిక ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు 2020లో 45.97 శాతం ఉండగా.. 2021 నాటికి 46.2 శాతానికి చేరింది. అది మొత్తం 2023 నాటికి 60.62 శాతానికి వచ్చి చేరింది. విద్యార్థి దశనుంచే ఉపాధి మార్గంవైపు మళ్లించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ(యూజీ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌‌ను యూజీసీ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను అక్టోబరు 10న విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం యూజీ ఇంటర్న్‌షిప్‌ రెండు రకాలుగా ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...