AU Admissions: ఆంధ్రా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ కోర్సులు, ప్రవేశాలు ఇలా

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ 2023-24 విద్యా సంవత్సరానికిగాను మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ 2023-24 విద్యా సంవత్సరానికిగాను మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెల్ఫ్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్స్ కింద ఈ సీట్లను భర్తీచేయనున్నారు. ఈ కోర్సులను డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నిర్వహిస్తుంది. మూడేళ్ల లా డిగ్రీ కోర్సుకు డిగ్రీ అర్హత, అయిదేళ్ల లా డిగ్రీ కోర్సుకు ఇంటర్ అర్హత ఉండాలి. వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

* లా కోర్సుల్లో ప్రవేశాలు

1) అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ: 18 సీట్లు

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. బీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉండాలి.

కోర్సు ఫీజు: రూ.90,000.

2) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ: 15 సీట్లు

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. బీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉండాలి.

కోర్సు ఫీజు: రూ.90,000.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. 

ఎంపిక విధానం: లాసెట్‌/ పీజీ లాసెట్‌/ క్లాట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌ ప్రకారం మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.10.2023.

➥  కౌన్సెలింగ్ తేది: 21.10.2023. 

సమయం: ఉ.10.00 గంటల నుంచి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director, 
Directorate of Admissions, 
AndhraUniversity, 
Vijayanagar Palace, Pedawaltair, 
Visakhapatnam - 530017.

Notification

Application (3 Yrs Law)

Application (5 Yrs Law)

Website

ALSO READ:

ఓయూలో దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీబీ రెడ్డి తెలిపారు. యూకేపీ ఆదేశాల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola