CASS European Institution Of Management Studies: టాప్ ఫ్రాన్స్ సంస్థల్లో ఒకటి FR ఇనిస్టిట్యూషన్ CASS యూరోప్ (CASS యూరోపియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్) భారతదేశంలో తమ కొత్త అడ్మిషన్ల కార్యాలయాన్ని భాగ్యనగరంలో గురువారం కొత్తగా ప్రారంభించింది. పారిస్‌లో ఉన్న ఇనిస్టిట్యూట్, యూనివర్శిటీ అడ్మిషన్లు, ఎన్‌రోల్‌మెంట్‌లో దక్షిణ భారత భాగస్వామిగా ఉన్న 'బ్లూ రిబ్బన్' ఓవర్ సీస్‌తో భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో యూనివర్శిటీ ఇండియా హెడ్ శ్రీ చారుదుత్త బుధంకర్ CASS యూరోప్ నుంచి ఇక్కడ టాప్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్లను కలవడానికి ఫ్రాన్స్ నుంచి వచ్చారు.


ఫ్రాన్స్ విద్యకు డిమాండ్ పెరగడం, ఫ్రాన్స్‌లో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ డైరెక్టర్ Mr. సంతోష్ కుమార్ కన్సల్టెంట్లను ఈ సందర్భంగా పరిచయం చేశారు. విద్య తర్వాత కూడా 5 సంవత్సరాల వరకు ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ప్రతి కోర్సుతో ఇంటర్న్‌షిప్‌లు, హై-ఎండ్ స్కాలర్‌షిప్‌ల లభ్యత వంటి భావి అవకాశాల కారణంగా విద్యార్థులు డిమాండ్‌లో ఉన్న ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారని వివరించారు.


'చదువుతో పాటు ఉద్యోగావకాశాలు'


విదేశీ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో విద్యనందిస్తూ ఆ వర్శిటీలతో భాగ్యస్వామ్యమై ఉన్న పెద్ద సంస్థ బ్లూరిబ్బన్ కన్సల్టెంట్ అని 'బ్లూ రిబ్బన్' ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సోషల్ మీడియా ఇన్చార్జ్ గొల్లూరి  గణేష్ సాగర్ అన్నారు. విద్యార్థినీ విద్యార్థులను, విదేశాల్లోకి పంపించిన తర్వాత కూడా వారికి రక్షణగా ఉంటూ, అక్కడ ఉన్న బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆఫీస్ స్టాఫ్, విదేశీ యూనివర్సిటీలకు వెళ్లి అక్కడ చదువుతున్న మన విద్యార్థిని, విద్యార్థులకు అండగా నిలుస్తూ వారి చదువుపై వారి ఉద్యోగ అవసరాలపై ఆరా తీస్తుంటారని చెప్పారు. చదువు పూర్తైన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తూ, మనకు అండగా ఉన్న సంస్థ బ్లూ రిబ్బన్ రావారిస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అని పేర్కొన్నారు.


Also Read: Universities: తెలంగాణలో మరో 5 ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం