న్యాయవిద్య ను అభ్యసించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఆధునికీకరణ వల్ల 'లా' కోర్సుల్లో కూడా ఎన్నో స్పెషలైజేషన్లు వచ్చాయి. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ 'లా' కోర్సులు అదనపు మెరుపు. న్యాయవిద్యను అభ్యసించే వారికి బిజినెస్ లా, కార్పొరేట్ లా, ఫ్యామిలీ లా, లేబర్ లా, టాక్స్ లా, హెల్త్ లా ఇలా తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు న్యాయవిద్యను అభ్యసించటానికి దూరప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎంతో ప్రాచుర్యం పొందిన 'లా' కాలేజీ లు ఉన్నాయి. అందులో టాప్ కాలేజెస్ ఇవే!
నల్సార్ 'లా' యూనివర్సిటీ
నల్సార్ యూనివర్సిటీ ఇండియాలోనే మొదటి న్యాయ విశ్వవిద్యాలయం. ఇండియాలోని ప్రముఖ 'లా' యూనివర్సీటీల్లో నల్సార్ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. అధునాతన ఫెసిలిటీస్ తో, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటూ, వివిధ ఇంటిగ్రేటెడ్ ఇంకా పీహెచ్ డీ ప్రోగ్రాములు కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఇవే కాకుండా, ఏవియేషన్, స్పేస్, టెలికమ్యూనికేషన్స్, GIS మరియు రిమోట్ సెన్సింగ్‌లలో అధునాతన కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తోంది.
బీఏ ఎల్ ఎల్ బీ (ఆనర్స్) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, ఎల్ ఎల్ ఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాముల్లో అధికంగా ఇక్కడ విద్యార్థులు చేరుతుంటారు. నల్సార్ కేవలం 132 సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నందున, క్యాట్ స్కోర్ మెరిట్ ఆధారంగా ఈ సీట్లకు పోటీ అధికంగా ఉంటుంది.
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్'లా'
ఇండియాలో అత్యంత ప్రాచీనమైన 'లా' యూనివర్సిటీ ఉస్మానియా. ఇది 1899 లో స్థాపించబడింది. ఇందులో బీఏ ఎల్ ఎల్ బీ, ఎల్ ఎల్ ఎం,అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటు 'లా' లో డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సైబర్ లాస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (PGDCL), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్ లాస్ (PGDTIL) కోర్సులను కూడా ప్రవేశ పెట్టింది. రిజర్వేషన్ ఇంకా..మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఇక్కడ సీట్ లభిస్తుంది.
మహాత్మాగాంధీ 'లా' కాలేజ్
మహాత్మాగాంధీ 'లా' కాలేజ్ 1991 లో స్థాపించబడింది. ఇది ఇండియాలోని 'లా' కాలేజీల్లో 8 వ స్థానంలో ఉంది. వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ 'లా' ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎల్ ఎల్ బీ మూడు& ఐదు సంవత్సరాల కోర్సుతో పాటు, ఎల్ ఎల్ ఎం డిస్టన్స్ మరియు రెగ్యులర్ లో అందుబాటులో ఉంది.
పడాల రామిరెడ్డి 'లా' కాలేజ్
పడాల రామిరెడ్డి 'లా' కాలేజ్ 1982 లో స్థాపించబడింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్. వివిధ రకాల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. థియరీ తో పాటు, ప్రాక్టికల్ పద్ధతిలో న్యాయవిద్యను భోదించటం ఈ కాలేజ్ ప్రత్యేకత.
కె.వీ రంగారెడ్డి 'లా' కాలేజ్
హైదరాబాద్ లోని ఉన్నత 'లా' కాలేజీల్లో న్యాయవిద్యను అభ్యసించటానికి ఎక్కువ మంది చేరుతున్న కాలేజ్ కె.వీ రంగారెడ్డి 'లా' కాలేజ్. ఇది 1991 లో ఎస్టాబ్లిష్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధమై ఉంది.