Computer Science Engineering: ఈరోజుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నేటి టెక్నాలజీ యుగంలో ఈ కోర్సు చదివేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు, అంతకుమించిన వేతనాలు, భవిష్యత్తు అంతా టెక్నాలజీ రంగానిదే కావడంతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివేందుకే చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల చూపు ఇప్పుడు సీఎస్ఈ గ్రూపుపైనే ఎక్కువగా ఉంటోంది. చాలా కాలేజీల్లో సీఎస్ఈ గ్రూపు సీట్లు ఇట్టే ఫిల్ అయిపోతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. దీంట్లో ఎన్నో అవకాశాలు ఉంటున్నాయి. విదేశాల్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి.. ఇటీవలి సర్వే ప్రకారం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివేందుకు టాప్ 10 దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


1. యునైటెడ్ స్టేట్స్


MIT, స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మెల్లన్ లతో సహా కంప్యూటర్ సైన్స్ కోసం ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు యునైటెడ్ స్టేట్స్ నిలయం. యూఎస్ లో టెక్ పరిశ్రమలు ఎంతగా అభివృద్ధి చెందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.


2. యునైటెడ్ కింగ్‌డమ్


అమెరికా తర్వాత చాలా మంది భారతీయ విద్యార్థులు చూపు యూకే వైపే. ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలు యూకేలో ఉన్నాయి.  అగ్రదేశానికి ఏమాత్రం తీసిపోని నాణ్యమైన చదువులు ఇక్కడ కూడా ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు ఎలాగూ ఎక్కువే.


3. కెనడా


యూఎస్, యూకే కాకుండా మరింత ఎక్కువగా ఆకట్టుకునే దేశం కెనడా. కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఉత్తమ దేశాల్లో ఇదీ ఒకటి. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పరిశ్రమ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది.


4. జర్మనీ


యూఎస్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే ఇక్కడ చదువుకు అయ్యే ఖర్చు తక్కువ. నాణ్యతలో రాజీ పడాల్సిన అవసరం లేనే లేదు. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ దేశం.. టెక్నాలజీలోనూ ముందుంది.


5. స్విట్జర్లాండ్


స్విట్జర్లాండ్ ఓ చిన్న దేశం. కానీ పేరు ప్రఖ్యాతలు, గొప్ప ఆవిష్కరణలకు, పేరొందిన విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసిపోదు. పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెట్టే దేశం.


Also Read: Student Accommodation: హలో స్టూడెంట్స్! హాస్టల్‌లో జాయిన్ అవబోతున్నారా? వీటి గురించి తప్పక తెలుసుకోండి


6. సింగపూర్


అగ్రదేశాలతో పోటీ పడి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం సింగపూర్. నాణ్యమైన విద్యాబోధనతో మంచి పేరు సంపాదించుకున్నాయి ఇక్కడి వర్సిటీలు.


7. నెదర్లాండ్స్


నెదర్లాండ్స్ కంప్యూటర్ సైన్స్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన దేశం. దేశంలోని విశ్వవిద్యాలయాలు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాములను అందించడంలో ముందుంటాయి.


8. ఆస్ట్రేలియా


భారతీయ విద్యార్థులు చూపు ఆస్ట్రేలియాపై పెరుగుతూ వస్తోంది. యూఎస్, యూకే తర్వాత ఎక్కువ మంది వెళ్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అందించే ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.


9. ఐర్లాండ్


టెక్నాలజీ రంగానికి ఐర్లాండ్ దేశం గ్లోబల్ హబ్ గా మారింది. ఇక్కడి మల్టీ నేషనల్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 


10. న్యూజిలాండ్


స్థిరంగా ప్రపంచ ప్రముఖ విద్యాసంస్థల్లో న్యూజిలాండ్ లోని వర్సిటీలు ఎప్పుడూ స్థానం సంపాదించుకుంటాయి. న్యూజిలాండ్ లో కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థులకు ఉపాధి, వ్యాపార అవకాశాలు బోలెడు ఉంటాయి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial