SV Music College Admissions : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో 2022-23 విద్యా సంవత్సరానికి పలు రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన విద్యార్థుల దరఖాస్తు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. జూన్ 16వ తేదీ నుంచి క‌ళాశాల‌లో ద‌ర‌ఖాస్తులు జారీ చేస్తారు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తులను జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు స్వీక‌రిస్తారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వ‌యోలిన్‌, వీణ‌, ఫ్లూట్‌, నాద‌స్వరం, భ‌ర‌త‌నాట్యం, హ‌రిక‌థ‌, మృదంగం, డోలు, ఘ‌టం విభాగాల్లో ఫుల్‌టైమ్ విశార‌ద‌(డిప్లొమా), ప్రవీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికేట్‌, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జులై 1వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్టల్ వ‌స‌తి కల్పిస్తామని టీటీడీ తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల పని వేళల్లో రూ.50 చెల్లించి దరఖాస్తు పొందొచ్చని, ఇతర వివరాల కోసం 7330811173, 9391599995 నంబ‌ర్లను సంప్రదించగలరని తెలిపింది.


ఆన్‌లైన్‌లో శ్రీవారి అంగప్రదిక్షణ టిక్కెట్లు


పదమొక్కుల వాడు, భక్త వత్సలుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి  వారిని భక్తులు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వి‌ఐపి బ్రేక్, ఆర్జితసేవ, అంగప్రదక్షణ వంటి రూపాల్లో భక్తులకు లభిస్తోంది.  కోవిడ్ కారణంగా తాత్కాలికంగా తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపి వేశారు.  దాపు రెండున్నర ఏళ్ళ తరువాత తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తారీఖు నుండి తిరిగి ఆఫ్ లైన్ లో అంగప్రదక్షణ టోకెన్లను టిటిడి తిరుమలలోని సిఆర్వో కార్యాలయం వద్ద భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ నేపధ్యంలో రోజు వారి తిరుమలలో జారీ చేసే అంగప్రదక్షణ టోకెన్ల ప్రక్రియను భక్తుల సౌఖర్యార్ధం ఆన్లైన్ లో తీసుకొచ్చేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. 


ఆన్‌లైన్‌లోనే టోకెన్లు జారీ 


ఆనంద నిలయం చుట్టూ ఓ పదక్షణ చేసిన తరువాత వారికి స్వామి దర్శన భాగ్యం కల్పిస్తుంది టిటిడి.. ఇలా స్వామి వారి అంగప్రదక్షణ చేసి మొక్కులు తీర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక భాధల నుండి విముక్తి లభించడమే కాకుండా,ఎన్నో జన్మ పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.. ఈ క్రమంలోనే  ప్రతి రోజు మధ్యాహ్నం తిరుమల సిఆర్వో కార్యాలయం వద్ద జారీ చేసే అంగప్రదక్షణ టోకెన్లకు భారీ డిమాండ్ ఉంటుంది.. ఉదయం నుండి భక్తులు క్యూలైన్స్ లో టోకెన్ల కోసం వేచి ఉండి టోకెన్లను పొందతూ ఉంటారు భక్తులు.. ఈ సమయంలో అధిక రద్దీ నేపధ్యంలో భక్తుల మధ్య కొంత తోపులాట జరిగే అవకాశం ఉంటుంది.. అయితే భక్తులు ఇబ్బందులను దృష్టిలో తీసుకున్న టిటిడి.. ఇకపై భక్తుల సౌఖర్యార్ధం ఆన్లైన్ లో అంగప్రదక్షణ టోకెన్ల జారీ చేయాలని నిర్ణయించింది.


జూన్‌ 15 నుంచి అందుబాటులోకి !


ఈ నెల 15వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ‌ టోకెన్లను అందుబాటులోకి తీసుకుని రానుంది టిటిడి.. అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టోకెన్ల‌ను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచేందుకు టిటిడి సిద్దం చేస్తుంది.. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు సౌక‌ర్యార్థం ఇక‌పై టీటీడీ ఆన్‌లైన్‌లోనే విడుద‌ల చేయ‌నుంది.. ఇందులో భాగంగా జూన్ 15వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు జూన్ 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు.. ఇందుకు సంబంధించిన టిటిడి వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టికెట్లు బుక్ పొందే అవకాశం కల్పించింది.