JEE Main 2022 Postpone : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ రెండో విడత పరీక్షలను అనూహ్యంగా వాయిదా వేశఆరు. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను చివరి క్షణంలోవాయిదా వేయడంతో విద్యార్థులు గందరగోళగానికి గురవుతున్నారు. బుధవారం జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) కీలక నిర్ణయం ప్రకటించింది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ను ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్ష వాయిదాకు గల కారణాలు చెప్పలేదు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగాయి. ఫలితాలు జూలై 11న ప్రకటించారు.
JEE మెయిన్ 2022 సెషన్-2 పరీక్షకు 6,29,778 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూలై 25 నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు దేశం వెలుపల 17 నగరాలతో సహా దేశంలోని దాదాపు 500 నగరాల్లో అభ్యర్థులు హాజరవవ్వాల్సి ఉంది. అయితే.. సెషన్ 2 పరీక్షలకు సంబంధించి city intimation slips విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే అడ్మిట్ కార్డులు (JEE Main Session 2 Admit Card) జులై 21న విడుదల చేయనున్నారు.
జేఈఈ మెయిన్ 2022 గతంలో ఏడాదికి ఒకటేసారి జేఈఈ మెయిన్ నిర్వహించే వారు. కానీ కరోనాతో పరిస్థితి మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థులకు నాలుగు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రేవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(NTA) నిర్వహించే జాయంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ పరీక్ష కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ర్యాంక్ సాధించిన విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నిట్స్ లాంటి పేరున్న సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు.
జేఈఈ మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
మొదటగా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను సందర్శించండి
హోం పేజీలో జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 అడ్మిడ్ కార్డ్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి
అభ్యర్థులు మీ మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ తో పాటు సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేయాలి
జేఈఈ మెయిన్ 2022 హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
మీ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్షకు హాజరు కావాలంటే హాల్ టికెట్ కావాలి కనుక దాన్ని ప్రింటౌట్ తీసుకోవడం మరిచిపోవద్దు.