Talliki Vandanam News Updates | అమరావతి: సూపర్ సిక్స్ లో భాగంగా ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా తల్లికి వందనం నిధులు విడుదలకు సిఎం చంద్రబాబు (Chandrababu) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు నేడు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీని నెరవేర్చుతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు.

67,27,164 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున తల్లులు, గార్డియన్ బ్యాంకు ఖాతాల్లో జూన్ 12 నాడు జమ చేయనున్నారు. తల్లికి వందనం పథకం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం రూ. 8745 కోట్లు విడుదల చేసింది. తల్లికి వందనం విధి విధానాలను ఖరారు చేస్తూ జీ.వో విడుదల చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులు సైతం తల్లికి వందనం పథకానికి అర్హులు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, దీపం-2, మెగా డీఎస్సీ, పథకాలను అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 

తల్లికి వందనం అర్హతకు సంబంధించిన గైడ్‌లైన్స్ఎ) గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆ కుటుంబం నెల ఆదాయం రూ .10,000 మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో నెల ఆదాయం 12,000 మించరాదు.బి) ఇంట్లో ఒకరికి రేషన్ కార్డు ఉండాలి.సి) ఇంటి మొత్తం భూమి సాగుభూమి అయితే 3 ఎకరాల కంటే తక్కువ, సాగుకు యోగ్యం కాని భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. రెండు రకాల భూమి ఉంటే మొత్తం కలిపి 10 ఎకరాల లోపే ఉండాలి. డి) కుటుంబంలో ఎవరికైనా ఫోర్ వీలర్ (టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయింపు) ఉంటే వారు అర్హులు కాదు.ఇ) నెలవారీ విద్యుత్ వినియోగం (సొంత లేదా అద్దె ఇల్లు) ఇంటి కోసం నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. (12 నెలల విద్యుత్ వినియోగం సరాసరిని పరిగణనలోకి తీసుకుంటారు).f) మునిసిపాలిటలో 1000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ స్థలంలో ఇంటిని కలిగి ఉండకూదు. g) కుటుంబంలో ఎవరైనా కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వం /పిఎస్‌యులో పనిచేసే వారు లేదా రిటైర్మెంట్ తరువాత పెన్షన్ పొందతున్నా అనర్హులు అవుతారు. కానీ పారిశుధ్య కార్మికులకు మినహాయింపు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ .10,000/- కంటే తక్కువ జీతం, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ .12,000 లోపు జీతం వచ్చేవారికి మినహాయింపుh) కుటుంబసభ్యులలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే అనర్హలు. i) లబ్ధిదారుల ఇంటి వివరాలు ప్రభుత్వ డేటాబేస్లో ఉండాలి. ఈ ఇంటి అడ్రస్ లో లబ్ధిదారులు లేకున్నా, విద్యార్థి వివరాలు డేటా బేస్‌లో ఉన్నట్లయితే GSWS డిపార్ట్మెంట్ విద్యార్థుల అర్హతలను నిర్థారించడానికి, లబ్ధిదారుని వివరాలు మ్యాప్ చేయడానికి క్షేత్రస్థాయిలలో పరిశీలన చేపడతారు. j) లబ్ధిదారుడి పిల్లలు ప్రభుత్వ/ ప్రైవేట్ ఎయిడెడ్/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు/ జూనియర్ కాలేజీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్/ జూనియర్ కాలేజీలలో చదివితే అర్హులు. ఒకవేళ ITI/ పాలిటెక్నిక్ /IIIT (RGUKT) ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రయోజనం పొందిన ఇలాంటి కోర్సుల విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. k) స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో చేరిన అనాథలు, వీధి బాలలు ధృవీకరణకు లోబడి ఈ ప్రయోజనానికి అర్హులవుతారు. సంబంధిత శాఖలు నిర్ధారిస్తేనే లబ్ధిl) ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) కోసం ఆధార్ అనుసంధానం ఉండేలా తల్లి బ్యాంక్ ఖాతా NPCI స్థితి (Aadhar Seeding) ధృవీకరించబడాలిj) లబ్ధిదారుడి పిల్లలు ప్రభుత్వ/ ప్రైవేట్ ఎయిడెడ్/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు/ జూనియర్ కాలేజీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్/ జూనియర్ కాలేజీలలో చదివితే అర్హులు. ఒకవేళ ITI/ పాలిటెక్నిక్ /IIIT (RGUKT) ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రయోజనం పొందిన ఇలాంటి కోర్సుల విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. k) స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో చేరిన అనాథలు, వీధి బాలలు ధృవీకరణకు లోబడి ఈ ప్రయోజనానికి అర్హులవుతారు. సంబంధిత శాఖలు నిర్ధారిస్తేనే లబ్ధిl) ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) కోసం ఆధార్ అనుసంధానం ఉండేలా తల్లి బ్యాంక్ ఖాతా NPCI స్థితి (Aadhar Seeding) ధృవీకరించబడాలిm) ఈ విద్యా సంవత్సరంలో 75 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థికి స్కీమ్ అమలు చేస్తారు. విద్యార్థి చదవు మధ్యలోనే ఆపేసినా, 75 శాతం అటెండెన్స్ లేకపోయినా తరువాతి సంవత్సరంలో తల్లికి వందనం ఆర్థిక సహాయం పొందడానికి అనర్హులు. n) ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ తరగతులకు మాత్రం మొత్తం నమోదు ప్రక్రియ తరువాత అకడమిక్ ఇయర్ 2025-26 కోసం అర్హుల్ని నిర్ధారిస్తారు.