హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నూనె శ్రీధర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నూనె శ్రీధర్ ప్రస్తుతం చొప్పదండి నీటిపారుదల ఈఈగా ఉన్నారు. శ్రీధర్ బ్యాంకు ఖాతాలో లావాదేవీలను, లాకర్లను తెరిచి వివరాలు రాబట్టాలని పోలీసులు చూస్తున్నారు. తనిఖీల్లో దొరికే పత్రాలు వివరాలు ఆధారంగా మరిన్ని ఆస్తులను గుర్తించడానికి అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, ఆదాయానికి మించి 200 కోట్ల రూపాయల పైచిలుకు అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారని ఆరోపణలతో శ్రీధర్‌ను అరెస్ట్ చేశారు.

ఏసీబీ అధికారుల తనిఖీలు

ఏసీబీ అధికారులు బుధవారం నుంచి ఈఈ శ్రీధర్ ఇళ్లల్లో, 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రిమాండ్ విధించడంతో శ్రీధర్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆయనకు పలుచోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు తనిఖీలలో తేలింది. తెల్లాపూర్‌లో ఒక విల్లా, షేక్‌పేట్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలో 4,500 చదరపు అడుగుల ఒక ఫ్లాట్, కరీంనగర్‌లో మూడు ఫ్లాట్లు,  అమీర్‌పేటలో ఒక కమర్షియల్‌ కాంప్లెక్స్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో ఒక్కటి చొప్పున బిల్డింగ్స్, హైదరాబాద్‌, వరంగల్, కరీంనగర్2లలో 19 ఇళ్ల స్థలాలు,  16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను గుర్తించారు. ఈఈ శ్రీధర్ రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది. ఆయన ఆస్తులపై ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంక్ లాకర్లు తెరవనున్నారు. లభ్యమైన పత్రాలు పరిశీలిస్తే, వాటి ద్వారా మరిన్ని ఆస్తులు గుర్తించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

List of assets amassed just got bigger - 

EE Nune Sridhar Arrested and sent to remand, searches are still going on 

1 Villa at Tellapur1 flat in Shaikpet3 flats in KarimnagarCommercial space at Ameerpet1 independent building at #Hyderabad1 independent building at #Warangal, 1 independent building at #Karimnagar16 acres of agricultural land19 residential prime open plots in Hyderabad, Warangal, Karimnagar,2 four wheelersGold ornaments & Bank deposits