World Against Child Labour Day 2025 Theme : ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థను తీవ్రమైన సమస్యగా గుర్తించి.. దానిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా, బాలలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిని ఎప్పుడూ ప్రారంభించారు. ఈ స్పెషల్ డే ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏడాది థీమ్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ చరిత్ర
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి 2002లో మొట్టమొదటి సారిగా బాల కార్మికుల వ్యతిరేక ప్రపంచ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. బాల కార్మికులకు రక్షణ కల్పించి సురక్షితమైన విద్యను అందించి పురోగతిని కల్పించడమే లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికీ బాల కార్మికులను నిర్మూలనలో పురోగతి ఉన్నప్పటికీ.. దానిని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నాలను వేగవంతం చేసే విధంగా కృషి చేస్తున్నారు.
బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ప్రారంభం నుంచి నిజమైన పురోగతిని చూసింది. అయితే కొవిడ్ మహమ్మారి, ఇతర సమస్యల వల్ల మరిన్ని కుటుంబాలు పేదరికంలోకి వెళ్లాయి. దీంతో మళ్లీ లక్షల మంది పిల్లలు బాలకార్మికులుగా మారారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా చేస్తున్నారు. అంటే ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు కార్మికులుగా చేస్తున్నారు.
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ ప్రాముఖ్యత
ప్రతి పిల్లలకు బాల్యం అవసరం. ఈ విషయంపై తల్లిదండ్రులకు, కంపెనీలకు అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు కృషి చేస్తున్నాయి. పిల్లలను బలవంతంగా పనికి పంపడానికి బదులుగా.. వారి అభివృద్ధి కోసం మంచి జీవితాన్ని అందించాలనే ఉద్దేశాన్ని ప్రధానంగా గుర్తు చేస్తుంది. సమాజంలో వారికి గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ స్పెషల్ డేని తీసుకెళ్తున్నారు.
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌లో వివరించిన విధంగా 2025 నాటికి అన్ని రకాల బాల కార్మికులను నిర్మూలించే లక్ష్యంతో సమన్వయం చేస్తుంది. ఇదే గోల్ రీచ్ అయితే SDGలో ఇది ఒక మైలు రాయి అవుతుంది. అందుకే బాల కార్మికుల నిర్మూలనలో నిబద్ధతతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నారు.
ప్రపంచం బాల కార్మికుల వ్యతిరేక 2025 దినోత్సవం థీమ్
ఈ ఏడాది మనం సాధించి పురోగతిని, ప్రపంచ లక్ష్యాలను చేరుకోవడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలను వేగవంతం చేయాలనే అవసరాన్ని హైలైట్ చేస్తుంది. గత దశాబద్దంతో పోల్చుకుంటే బాల కార్మికులు 38 శాతం తగ్గారు. ఈ థీమ్‌లో భాగంగానే బాల కార్మికులను నిర్మూలించడానికి మెరుగైన నివారణ, రక్షణ, భాగస్వామ్యాలకు పిలుపునిచ్చే డర్బన్ కాల్ టు యాక్షన్‌లో నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా ఆమోదించేలా చర్యలు తీసుకుంటున్నారు.