TG ECET 2025: తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2025) సీట్ల కేటాయింపు తొలి దశ ప్రక్రియ పూర్తి అయింది. దీనికి సంబంధించిన ఫలితాలను ఈరోజు, జూన్ 25న తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) విడుదల చేసింది. ఫేజ్ 1 కౌన్సెలింగ్ వివరాలను అధికారిక వెబ్‌సైట్- tsecet.nic.inలో ఉంచింది. TS ECET 2025 ఫేజ్ 1 సీట్ల కేటాయింపు వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
విద్యాశాఖాధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు జూన్ 29 లోపు అడ్మిషన్ పే చెల్లించాలి. అడ్మిషన్‌ను నిర్ధారించడానికి అభ్యర్థులు ఆన్‌లైన్ స్వీయ-రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకుంటే కేటాయించిన సీటు రద్దు చేస్తారు.
TG ECETలో అభ్యర్థుల ర్యాంక్, సీట్ల లభ్యత, రిజర్వేషన్ నియమాల ఆధారంగా సీట్ల కేటాయింపు చేపట్టారు. ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్, బి.ఫార్మసీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలను జులై 22, 2025న విడుదల చేస్తారు. ఆ వివరాలను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. స్పాట్ అడ్మిషన్‌లను జులై 29, 2025 లోపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.