తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రి పూర్తయింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అత్యధిక శాతం విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) కోర్సునే ఎంచుకొన్నారు. సీఎస్‌ఈ, ఐటీ తత్సమాన కోర్సుల్లో 98.49% సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈలో మొత్తం 18,682 సీట్లు ఉంటే 18,666 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 6 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. డేటా సైన్స్‌లో 99.64%, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్‌లర్నింగ్‌లో 98.97% సీట్లు భర్తీ అయ్యాయి.
ఎంసెట్ తొలి విడుత సీట్ల కేటయింపును సాంకేతిక విద్యాశాఖ అధికారులు సెప్టెంబరు 6న పూర్తిచేశారు. యూనివర్సిటీ కాలేజీల్లో 84.99%, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 77.94%, ప్రైవేట్ కాలేజీల్లో 84.56% చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా తొలి విడతలో 84.45% సీట్లు భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 4,943 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 13లోగా ఫీజు చెల్లించాలని, 17 నుంచి 21లోపు జిరాక్స్ సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించి రిపోర్ట్‌చేయాలని అధికారులు సూచించారు.
కాలేజీల వారీగా సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంజినీరింగ్‌లో మొత్తం 45 రకాల కోర్సులుండగా, పలు కోర్సుల్లో వందకు వందశాతం సీట్లు నిండాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ట్ అండ్ టెలిమ్యాటిక్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెడ్ మాన్యుఫ్రాక్టరింగ్ సిస్టమ్స్, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో సీట్లు వందశాతం భర్తీ అయ్యాయి. మొదటి విడుతలోనే మొత్తం సీట్లు భర్తీకాగా, వీటిల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటం గమనార్హం. ఒక యూనివర్సిటీ కాలేజీ, 31 ప్రైవేట్ కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి.
Also Read: AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల
ఇంజినీరింగ్‌లో కోర్ కోర్సు అయిన మెకానికల్, ఈఈఈ, సివిల్ ఇంజినీరింగ్ సీట్లకు రోజురోజుకు డిమాండ్ పడిపోతున్నది. ఈ మూడు కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తిచూపించడంలేదు. ఎంసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపులో మెకానికల్‌లో అతి తక్కువగా 31. 92% సీట్లు భర్తీకాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో 36.38% సీట్లు మాత్రమే నిండాయి. ఇక ఈఈఈలో 56.49% సీట్లు నిండితే ఒక్క ఈసీఈలో మాత్రమే 92.13% సీట్లు నిండాయి. ఖాళీగా ఉన్న సీట్లలో ఈ మూడు బ్రాంచిలకు సంబంధించి సీట్లే అధికంగా ఉన్నాయి.
నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. పదోతరగతి నుంచి ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో సెప్టెంబరు 12న భూదాన్ పోచంపల్లిలోని సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..