TS SSC Exams 2022 : పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షల సమయాన్ని 30 నిమిషాలు పొడిగించాలని ఎస్ఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల సమయాన్ని మరో అరగంట పొడిగిస్తున్నట్లు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి తెలిపారు. మూడు గంటల పదిహేను నిమిషాలు పరీక్ష సమయం ఉంటుందని అధికారుల సమావేశంలో మంత్రి తెలిపారు.
మరో 30 నిమిషాలు పెంపు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల సూచనల మేరకు ప్రతీ పరీక్షకు 30 నిమిషాలు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకూ 2 గంటల 45 నిమిషాల పాటు ఉండగా, ఇప్పుడు 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష సమయాన్ని అదనంగా 30 నిమిషాలు పొడిగించారు. అలాగే 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నట్లు బోర్డు గతంలోనే ప్రకటించింది. కరోనా కారణంగా తరగతులు ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
టెన్త్ పరీక్షల తేదీలు
- మే 23 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్ ఏ -(ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 24 - సెకండ్ లాంగ్వేజ్ -(ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 25- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 26- మ్యాథమెటిక్స్ - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 27- జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 28- సోషల్ స్టడీస్ - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 30- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్)- (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్) - (ఉదయం 9.30 - మధ్యాహ్నం 12.45 వరకు)
- జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ) - ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు