కాఫీలు చేశారా టిఫినీలు తిన్నారా అంటూ ఇంట్లో సామానంతా ఎత్తుకెళ్లిపోయిన బ్యాచ్‌ను మనం సినిమాల్లో చూసి ఉంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్.
ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రద్ధగా ఓ పెళ్లి మండపంలో కూర్చున్న వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే... పెళ్లి మండపంలో వరుడు వేరే పనిలో బిజీగా ఉంటున్న టైంలో అతని ఫ్రెండ్ తన చేతికి పని చెప్పాడు. వరుడు ధరించిన దండలోని కెరెన్సీ నోట్లు కొట్టేసేందుకు యత్నించాడు. ఒకటికి రెండుసార్లు ట్రై చేసి చివరకి విజయంతంగా చోరీ చేశాడు. సైలెంట్‌గా డబ్బులను జేబులో పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నాడు.
చాలా ప్రాంతాల్లో వధువు వరుడి మెడలో కరెన్సీతో తయారు చేసిన దండలు వేయడం ఆనవాయితీ. ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే ఆ కరెన్సీ కోసమే దగ్గర ఆ ఫ్రెండ్ కూర్చున్నట్టు కనిపిస్తోంది. కూర్చున్నప్పటి నుంచి దండలోని కరెన్సీ కొట్టేసేందుకు ట్రై చేశాడు. మొదటిసారి ట్రై చేశారు. వరుడు అటువైపుగా చూస్తున్న టైంలో దండలోని కరెన్సీ తీసేందుకు ఫ్రెండ్ ప్రయత్నిస్తాడు.. సడెన్‌గా వరుడు ఇటు తిరుగుతాడు. వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. మళ్లీ వరుడు అటు తిరిగిన వెంటనే చటుక్కున సైలెంట్‌గా పని కానిచ్చేస్తాడు. చేతికి దొరినది లాక్కొని బ్యాక్ పాకెట్‌లో పెట్టుకుంటాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీన్న విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఇండియన్ మనీ హీస్ట్ అంటూ కామెంట్ చేస్తే.. ఇదో వ్యాపారమంటూ మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. గంటల వ్యవధిలోనే లక్షల షెర్లు, లైక్స్ వచ్చాయి ఈవీడియోకి.