School Reopening In Telangana | హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం తేదీలో మార్పు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న స్కూళ్లు తెరవాల్సి ఉండగా, దానిని సవరిస్తూ జూన్ 15న పాఠశాలలను Reopen చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. స్కూల్స్ రీఓపెన్ మరింత ఆలస్యం అని తెలియగానే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. అప్పటిలోగా వర్షాలు మొదలై ఎండల తీవ్రత సైతం తగ్గనుంది.
జూన్ 12న కాదు.. జూన్ 15న స్కూల్స్ రీఓపెన్..ఈ తేదీ పొడిగింపునకు గల కారణాలను అధికారులు వెల్లడించారు. జూన్ 12న పాఠశాలలు తెరిచిన వెంటనే.. జూన్ 13న రెండవ శనివారం, జూన్ 14న ఆదివారం కావడంతో వరుసగా వారాంతపు సెలవులు వస్తున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ, విద్యార్థులు, టీచర్ల సౌకర్యార్థం జూన్ 12న కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ, రీఓపెనింగ్ తేదీని జూన్ 15కి మార్చింది.
Also Read: AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
అయితే, ఈ మార్పు కారణంగా విద్యా సంవత్సరం, వర్కింగ్ డేస్ నష్టపోకుండా ఉండేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. జూన్ 12న ఇచ్చిన సెలవుకు బదులుగా.. వచ్చే నెల అంటే జులై 11న వచ్చే రెండవ శనివారం స్కూల్స్ యథావిధిగా నిర్వహించి, తరగతులు తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారికంగా ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
Also Read: TS EAPCET 2026 Results : తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
