AP TET 2026: అమరావతి: ఏపీ టెట్ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2026) రాసే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏపీ టెట్-2026 పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా టెట్ పరీక్షల పూర్తి వివరాలను, తేదీలను వెల్లడించారు. టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటనతో వారి నిరీక్షణకు తెరపడింది.

Continues below advertisement

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 5వ తేదీన (శుక్రవారం నాడు) ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే అంటే, జూన్ 5 నుంచి జులై 5 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి, అలాగే పరీక్ష ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం, జులై 25వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

టెట్ పరీక్షలను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం (Computer Based Test)లో రోజూ రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. టెట్ ఎగ్జామ్స్ పూర్తయిన కొన్ని రోజులకే ఆగస్టు 24న ప్రాథమిక కీ (ప్రావిజనల్ కీ)ని, సెప్టెంబర్ 8న ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను వెల్లడించనున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

Continues below advertisement

AP TET 2026 ముఖ్యమైన తేదీలివే..

  • నోటిఫికేషన్: జూన్ 5న ఏపీ టెట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల
  • దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజులు చెల్లించేందుకు అవకాశం 
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: జులై 25 నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • టెట్ ఎగ్జామ్ డేట్స్: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు.
  • మొదటి సెషన్: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
  • రెండో సెషన్: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
  • ప్రాథమిక కీ విడుదల: ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
  • ఫైనల్ కీ విడుదల: సెప్టెంబర్ 8న ఫైనల్ కీ (AP TET Final Key) విడుదల 
  • ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.