TG PGECET Counsellimg: టీజీ పీజీఈసెట్‌-2024 కౌన్సెలింగ్‌ షెడ్యూలు వెల్లడి, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?

PGECET: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్ వెలువడింది. దీనిప్రకారం జులై 30 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

Continues below advertisement

TG PGEC / TG PGECET-2024 ADMISSIONS: తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఆర్క్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సుల్లో ప్రవేశాలకు జులై 30 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జులై 20న అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 30 నుంచి ఆగస్టు 9 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, ధ్రువపత్రాల అప్‌లోడింగ్ ప్రక్రియ కొనసాగనుంది. స్పెషల్ కేటగిరీ (ఎన్‌సీసీ/క్యాప్/పీహెచ్/స్పోర్ట్స్) అభ్యర్థులకు ఆగస్టు 1 నుంచి 3 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

Continues below advertisement

కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల ఎంపిక జాబితా, ఏమైనా తప్పులుంటే ఆగస్టు 10న తెలియజేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 12, 13 తేదీల్లో మొదటివిడత వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు ఆగస్టు 14న అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.  కళాశాలలవారీగా సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను ఆగస్టు 17న ప్రకటిస్తారు. సీట్లు పొందినవారు ఆగస్టు 18 నుంచి 21 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లోని సీట్లను రెండు మార్గాల్లో భర్తీ చేస్తారు. జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఇచ్చి సీట్లు నింపుతారు. ఆ తర్వాత పీజీఈసెట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. 

పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 20.07.2024

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్: 30.07.2024 - 09.08.2024.

➥ స్పెషల్ కేటగిరీ (ఎన్‌సీసీ/క్యాప్/పీహెచ్/స్పోర్ట్స్) సర్టిఫికేట్ వెరిఫికేషన్: 01.08.2024 - 03.08.2024.

➥ అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 10.08.2024.

➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 12.08.2024, 13.08.2024.

➥ వెబ్‌ఆప్షన్ల సవరణ: 14.08.2024.

➥ తొలివిడత సీట్ల కేటాయింపు: 17.08.2024.

➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 18.08.2024 - 21.08.2024.

➥ తరగతుల ప్రారంభం: 31.08.2024.

ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమయ్యే సర్టిఫికేట్లు..

➥ గేట్/జీప్యాట్ స్కోరుకార్డు / టీజీపీజీఈసెట్ ర్యాంకు కార్డు 

➥ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ (ప్రొవిజినల్/మార్కుల మెమో)

➥ ఇంటర్/డిప్లొమా సర్టిఫికేట్లు.

➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్.

➥ 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్లు

➥ రెసిడెన్స్ సర్టిఫికేట్.

➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (బీసీ, ఎస్టీ, ఎస్సీలకు)

➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01.01.2024 తర్వాత జారీచేసినది) 

➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్

➥ఎంప్లాయర్ సర్టిఫికేట్ (ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు)

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)

➥  మైనార్టీ సర్టిఫికేట్.

➥ పీహెచ్, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్.

Counselling Notification

Counselling Website

ALSO READ:
గేట్ - 2025 ప‌రీక్ష తేదీలు వెల్లడి, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో 2025 ప్రవేశాల కోసం నిర్వహించే 'గేట్' (GATE-2025) పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో గేట్-2025 పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. గేట్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు చివరివారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీఆర్) చేపట్టింది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Continues below advertisement