Tenali Doctor Died In America Road Accident: అమెరికాలో (America) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ వెటర్నరీ వైద్యురాలు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు (Guntur) జిల్లా తెనాలికి (Tenali) చెందిన జెట్టి హారిక అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.


తెనాలికి చెందిన జెట్టి హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి. తండ్రి దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. హారిక మృతితో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మంత్రి నారా లోకేశ్ చొరవ చూపాలని వేడుకుంటున్నారు.


Also Read: Crime News: తూ.గో జిల్లాలో దారుణం - భార్యపై అనుమానంతో కత్తెరతో పొడిచి చంపేశాడు