తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఆర్క్‌, ఎం.ఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ జులై 31 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు జులై 19న అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 28న కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. జులై 31 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 21 నుంచి 23 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 26న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు.


గతేడాది మాదిరిగానే సుమారు 11 వేల సీట్లుండగా.. అందులో 70 శాతం(7700 సీట్లు) వరకు కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీజీఈసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 4 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 16న రెండో విడత సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి.


పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 28.07.2023.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్: 31.07.2023 - 09.08.2023.


➥ అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 20.08.2023.


➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 21 - 23.08.2023.


➥ తొలివిడత సీట్ల కేటాయింపు: 26.08.2023.


➥ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ: 04.09.2023 - 23.09.2023.


➥ తరగతులు ప్రారంభం: 19.09.2023.


గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు తగ్గిన భారం..
రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లోని సీట్లను రెండు మార్గాల్లో భర్తీ చేస్తారు. జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఇచ్చి సీట్లు నింపుతారు. ఆ తర్వాత పీజీఈసెట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. గతేడాది వరకు నోటిఫికేషన్ రాక ముందే గేట్, జీప్యాట్ ర్యాంకర్లు తొలుత ర్యాంకు కార్డు, ఇతర వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉండేది. దానికి రూ.1200 ఫీజు చెల్లించాలి. మళ్లీ పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకు మరో రూ.1200లు చెల్లించాలి. అంటే రెండు సార్లు ఫీజు చెల్లించాల్సి వస్తుండటంతో కొందరు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన అధికారులు ఈ ఏడాది నుంచి ఒకేసారి రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇచ్చారు. కాకపోతే సీట్ల కేటాయింపులో మాత్రం యథావిధిగా గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇస్తారు.


ALSO READ:


జులై 21, 22 తేదీల్లో 'అగ్రికల్చర్' ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహణ, ఈ సర్టిఫికేట్లు ఉన్నాయా?
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు జులై 21 , 22 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవయసాయ విశ్వ విద్యాలయం తెలిపింది. ఈ మేరకు బుధవారం (జులై 19) కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికిగాను రెండేళ్ల వ్యవసాయ, సేంద్రీయ డిప్లొమా కోర్సుతోపాటు మూడేళ్ల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం. వెంకటరమణ తెలిపారు. షెడ్యూల్‌ను చూసి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి జులై 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్‌లో భాగంగా తొలి దశలో ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు  యూనివర్సిటీ & ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీల కాలేజీలలో కన్వీనర్ కోటా కింద ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. 
ఏపీఈఏపీసెట్ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial