TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

తెలంగాణలో ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలును టీఎస్ ఓపెన్ స్కూల్ సొసైటీ మార్చి 24న విడుదల చేసింది. పరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Continues below advertisement

తెలంగాణలో ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలును టీఎస్ ఓపెన్ స్కూల్ సొసైటీ మార్చి 24న విడుదల చేసింది. పరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల షెడ్యూలును చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి పది, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Continues below advertisement

ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనుండగా.. ఏప్రిల్ 25 నుంచి మే 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు.ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మే 12 నుంచి 19 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ ఏప్రిల్ 25న: 

ఉదయం సెషన్: తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి.

మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.

➥ ఏప్రిల్ 26న: 

ఉదయం సెషన్: ఇంగ్లిష్.

మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.

➥ ఏప్రిల్ 27న: 

ఉదయం సెషన్: ఉర్దూ.

మధ్యాహ్నం సెషన్: హిందీ.

➥ ఏప్రిల్ 28న: 

ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.

మధ్యాహ్నం సెషన్: ఎకనామిక్స్.

➥ మే 1న: 

ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.

మధ్యాహ్నం సెషన్: హోంసైన్స్.

➥ మే 2న: 

ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.

మధ్యాహ్నం సెషన్: అన్ని ఒకేషనల్ సబ్జెక్టులు (థియరీ).

➥ మే 3న: 

ఉదయం సెషన్: ఇండియన్ హెరిటేజ్ & కల్చర్

మధ్యాహ్నం సెషన్: అన్ని ఒకేషనల్ సబ్జెక్టులు (థియరీ).


ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ ఏప్రిల్ 25న: 

ఉదయం సెషన్: తెలుగు, ఉర్దూ, అరబిక్.

మధ్యాహ్నం సెషన్: హిందీ.

➥ ఏప్రిల్ 26న: 

ఉదయం సెషన్: ఇంగ్లిష్.

మధ్యాహ్నం సెషన్: మాస్ కమ్యూనికేషన్.

➥ ఏప్రిల్ 27న: 

ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీ

మధ్యాహ్నం సెషన్: పెయింటింగ్.

➥ ఏప్రిల్ 28న: 

ఉదయం సెషన్: హిస్టరీ, ఫిజిక్స్.

మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.

➥ మే 1న: 

ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.

మధ్యాహ్నం సెషన్: సోషియాలజీ.

➥ మే 2న: 

ఉదయం సెషన్: బయాలజీ, ఎకనామిక్స్.

మధ్యాహ్నం సెషన్: అకౌంటెన్సీ.

➥ మే 3న: 

ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.

మధ్యాహ్నం సెషన్: హోంసైన్స్.

➥ మే 4న: 

ఉదయం సెషన్: జియోగ్రఫీ.

మధ్యాహ్నం సెషన్: అన్ని ఒకేషనల్ సబ్జెక్టులు (థియరీ).

Also Read:

ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలో ఏప్రిల్‌లో నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసింది. పరీక్షల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 17 వరకు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 23 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌ అర్హతతో ఎంబీఏ, ప్రవేశ ప్రకటన విడుదల చేసిన ఇండోర్ ఐఐఎం
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఐదేళ్ల 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)' కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్ విద్యపై దృష్టి సారిస్తారు. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది.
కోర్సు, పరీక్ష తేదీ వివరాల కోసం క్లిక్ చేయండి. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Continues below advertisement
Sponsored Links by Taboola