Telangana Inter Fee Payment Dates: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల ఫీజు గడువును అధికారులు పొడిగించారు. వాస్తవానికి నవంబరు 26తో ముగియాల్సిన ఫీజు చెల్లింపు గడువును డిసెంబరు 3 వరకు పెంచుతున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా డిసెంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 11 నుంచి 17 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబరు 18 నుంచి 24 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో డిసెంబరు 25 నుంచి జనవరి 2 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. లాగ్ విద్యార్థులు(జనరల్, వొకేషనల్)లతో పాటు ఆర్ట్స్/ హ్యూమానిటీస్ గ్రూప్ విద్యార్థులలో హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.


పరీక్ష ఫీజు వివరాలు..


➥ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు(జనరల్):  రూ.520


➥ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు(ఒకేషనల్, ప్రాక్టికల్స్‌): రూ.750.


➥ ఇంటర్ సెకండియర్‌ జనరల్ (ఆర్ట్స్) విద్యార్థులు రూ.520.


➥ ఇంటర్ సెకండియర్‌ జనరల్ (సైన్స్) విద్యార్థులు రూ.750.


➥ ఇంటర్ సెకండియర్‌ ఒకేషనల్ విద్యార్థులు రూ.750.


పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు..


➥ ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 03.12.2024


➥ రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 04.12.2024 నుంచి 10.12.2024 వరకు


➥ రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి తేదీ: 11.12.2024 నుంచి 17.12.2024 వరకు


➥ రూ.1000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి తేదీ: 18.12.2024 నుంచి 24.12.2024 వరకు


➥ రూ.2000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి తేదీ: 25.12.2024 నుంచి 02.01.2025 వరకు




ALSO READ:
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...