తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను ఇంటర్మీడియట్‌ బోర్డు అక్టోబరు 6న ప్రకటించింది. ఈసారి ఇంటర్ కాలేజీలకు వారంపాటు సెలవులు రానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి 25 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. తిరిగి అక్టోబరు 26న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది.


తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు, జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబరు 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. ఇక రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 7 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబరు 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని విద్యాశాఖ పేర్కొంది.


ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు 2022లో 14 రోజులు ఉండగా..2023లో మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచింది.


ఏపీలో 11 రోజుల దసరా సెలవులు..
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఇక ఏపీలోని ఇంటర్ కాలేజీలకు కూడా తెలంగాణ మాదిరిగా.. అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.


ALSO READ:


TSBIE: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!
తెలంగాణలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ప్రవేశాలు పొందడానికి అక్టోబ‌రు 9 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ అక్టబరు 3న  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో ఎలాంటి రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ ప్రైవేటు అభ్యర్థుల పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, డిజీ లాకర్‌లో సర్టిఫికేట్లు
ఏపీలోని జూనియర్ కళాశాలల్లో స్థూల ప్రవేశాల నిష్పత్తి కోసం ఫెయిల్‌ అయిన ప్రైవేటు అభ్యర్థులు సైతం రెగ్యులర్‌గా చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇంటర్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులను తిరిగి కాలేజీల్లో చేర్చుకుని రీఅడ్మిషన్ కల్పించే ప్రక్రియ ఇంటర్‌లోనూ చేపట్టారు. పదోతరగతిలో రీఅడ్మిషన్ విధానం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించారు. ఇంటర్‌లోనూ రీఅడ్మిషన్ పొందవచ్చని, అలా చేరిన విద్యార్థులు ఫెయిల్ అయినవాటితోపాటు అన్ని సబ్జెక్టులు తిరిగి రాయాల్సి ఉంటుందని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పాసైన సబ్జెక్టుల్లో రెండు పరీక్షల్లో ఎక్కువగా వచ్చిన మార్కులను పరిగణనలోకీ తీసుకుంటామన్నారు. రీఅడ్మిషన్ పొంది ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే సర్టిపికేట్లు  జారీచేస్తామని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన, ప్రైవేటు విద్యార్థులు నవంబరు 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సౌరభ్‌గౌర్ ప్రకటించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...