Telangana intermediate Results 2026: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థుల నిరీక్షణకు తెరపింది. తెలంగాణ స్టే్ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్ ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అదివారం ఉదయం ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టడమే కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు వారి వాట్సాప్‌ ద్వారా కూడా తెలుసుకనే వీలు కల్పిస్తున్నారు. 

Continues below advertisement

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

ఫలితాల ప్రకటన రోజే విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక పోర్టల్స్ లో తమ మార్కులు చూసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. రద్దీ వల్ల వెబ్‌సైట్‌లు మొరాయించే ఛాన్స్ ఉందని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులు చేశారు. ఫలితాల కోసం విద్యార్థులు tgbie.cgg.gov.in, results.cgg.gov.in, results.gov.in, అధికారిక వెబ్‌సైట్‌లను ఫాలో కావాల్సి ఉంటుంది. 

వాట్సాప్‌లో ఎలా ఫలితాలు పొందాలి?

వాట్సాప్‌లో ఫలితాలు పొందాలనుకునే వారు మొదట తమ వాట్సాప్ నుంచి 8096958096 నెంబర్‌ సేవ్ చేసి పెట్టుకోవాలి. ఆ నెంబర్ నుంచి వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపించారు. తర్వాత మీకు సర్వీస్ మెనూ వస్తుంది. అందులో BIE- Exams Results అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి. మీకు మొదటి సంవత్సరం రిజల్ట్ కావాలా, రెండో ఏడాది రిజల్ట్‌ కావాలా లేదా స్ట్రీమ్ పై క్లిక్ చేయాలి. అందులో జనరల్, ఒకేషనల్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఒకదానిని ఎంచుకోవాలి. వివరాలు పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత వెంటనే సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజలట్స్‌ మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని తర్వాత ప్రింట్‌ అవుట్ తీసుకోవాలి. 

Continues below advertisement

స్కోర్ కార్డును డౌన్‌ ఎలా చేసుకోవాలి?

వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు పొందాలనుకునే వాళ్లు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి స్కోర్ కార్డును పొందవచ్చు.

ముందుగా అధికారికంగా అధికారులు ఇచ్చిన వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్‌పేజిలో కనిపించే  TS Inter 1st Year Results 2026 లేదా 'TS Inter 2nd Year Results 2026 అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 

తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్‌తోపాటు అడిగిన వివరాలు ఫిల్ చేయాలి. 

వివరాలు సరి చూసుకున్న తర్వాత సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్ చేయాలి. 

మీ స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని పీడీఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలి. ప్రింట్ అవుట్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది. 

డిజిలాకర్ ద్వారా అధికారిక మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఆధార్ నెంబర్‌, మొబైల్ ఓటీపీతో రిజిస్టర్ అవ్వాలి. 

స్కోర్ కార్డులో ఏం ఉంటాయి?

మీ ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో కీలక విషయాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యార్థి పేరు, రోల్ నెంబర్ సరిగా చూసుకోవాలి. తప్పులు ఉంటే అధికారులకు తెలియజేయాలి. సబ్జెక్టుల వారీగా మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులు, క్వాలిఫైయింగ్ స్టేటస్ చూడాలి.