MeghasandesamSerial Today Episode: అపూర్వను ఇంట్లో పడుకొబెట్టిన తర్వాత భూమి, గగన్‌ ఇంటికి వెళ్లి అక్కడి పెళ్లి చూపులు చెడగొడుతుంది. దీంతో గగన్‌ కోపంగా భూమిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. బయటకు వచ్చిన భూమి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు శరత్‌ చంద్ర ఇంట్లో అపూర్వను బెడ్‌ రూంలోంచి బయటకు తీసుకొస్తాడు శరత్‌ చంద్ర

Continues below advertisement

మీరా: అయ్యో వదిన ఇప్పుడు ఎలా ఉంది…?

అపూర్వ: చచ్చి బతికినట్టు ఉంది. 

Continues below advertisement

సుజాత: అదే అమ్మాయి చావు తప్పి కన్ను లొట్టపోయింది అంటారు కదా..? ఇక్కడ తల సొట్ట పడింది అన్నమాట. మా అమ్మాయి తల గట్టిది కాబట్టి ఒక్క నెత్తుటి చుక్క కూడా బయటకు రాలేదు.

శరత్‌: కేపీ ఇంట్లో ఉన్న పవర్‌ సప్లయ్‌ మొత్తం చెక్‌ చేయాలి. వెంటనే ఎలక్రిషియన్‌ను పిలిపించు.

అపూర్వ: బావ అది ఎలక్రిషన్‌ తప్పు కాదు బావ. నీ కూతురు కుట్ర.

శరత్‌: భూమినా..?

నక్షత్ర: పర్వాలేదు. కూతురు అనగానే.. ఆ భూమే అనేశారు టక్కున. అంటే మీకు మైండ్‌లో ఉందన్న మాట.

కేపీ: కడుపున పుట్టిన బిడ్డల గురించి ఆలోచించని తల్లిదండ్రులు ఉండరండి.

శరత్‌: నేను ఆలోచించను నా దారిలో నడవని వాళ్లు. నాకు గౌరవం ఇవ్వని వాళ్ల గురించి నేను అసలు ఆలోచించను.

అపూర్వ: బావ భూమిని బయటకు వెల్లకుండా చేయాలని నన్ను నక్షత్రను కాపాలా పెట్టావు కదా.. మా ఇద్దరిని చంపేసెయ్‌ అయినా సరే అది ఆ గగన్‌ దగ్గరకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసింది బావ.

కేపీ: అపూర్వ గారు ఇదంతా భూమియే చేసిందని ఎలా చెప్తారండి.

నక్షత్ర: డాడీ జ్యూస్‌ పైన పడిన తర్వాత వాష్‌ రూంకు వెళ్లు అని చెప్పింది డాడీ. మమ్మీకి షాక్‌ కొట్టింది కూడా అక్కడే.

కేపీ: ఏం నక్షత్ర ఆ ఒక్కమాటకే భూమిని నిందిస్తున్నావా..?

అపూర్వ: కరెంట్‌ షాక్‌ కొట్టించాలి అనే ప్లాన్‌ లేకపోతే నన్ను పైకి ఎందుకు పంపించింది.

శరత్‌: అపూర్వ అది నీ వాష్‌రూం కాబట్టి చెప్పిందేమో

అపూర్వ: అయ్యో కాదు బావ. ఇదిగో చూడండి ఈ కేపీ కూడా దొంగే.. భూమిని గగన్‌ గాడి దగ్గరకు పంపించడానికే మీరిద్దరూ కలిసి నన్ను చంపాలని ప్లాన్‌ చేశారు.

కేపీ: అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారండి..?

అపూర్వ: భూమి ఇప్పుడు ఆ గగన్‌ గాడి ఇంటికి వెళ్లిపోయిందని నాకు తెలుసు కేపీ.. కావాలంటే చూడు తను ఇంట్లో లేదు.

శరత్‌: కేపీ భూమి ఎక్కడ..?

కేపీ: ఇంట్లోనే పైన ఎక్కడో ఉండి ఉంటుంది.

అపూర్వ: లేదు అంటున్నాను కదా..?

శరత్‌: ఉంటే రమ్మని పిలువు కేపీ..

కేపీ: అమ్మా భూమి..

అపూర్వ: నువ్వు ఆగు.. నక్షత్ర నువ్వు వెళ్లి అన్ని రూములు వెతుకు..

నక్షత్ర: అలాగే మమ్మీ..

అంటూ నక్షత్ర వెళ్లి వెతికి వస్తుంది.

నక్షత్ర: అన్ని రూములు వెతికాను మమ్మీ. తను ఎక్కడ లేదు.

అపూర్వ: ఉండదు.. చూశావా బావ తను ఉండదు. నాకు తెలుసు. బావ నువ్వు కావాలంటే ఇప్పుడే గగన్‌కు ఫోన్‌ చేసి అడుగు.. కచ్చితంగా అది అక్కడే ఉంటుంది.

శరత్‌: నిజంగా భూమి అక్కడే ఉంటే కూతురు అని కూడా చూడను.. చంపేస్తాను..

అంటూ శరత్‌ చంద్ర ఫోన్‌ చేయబోతుంటే.. ఇంట్లో గంట సౌండ్‌ వస్తుంది. అందరూ పూజగది వైపు చూస్తుంటారు. పూజగదిలోంచి భూమి హారతి తీసుకుని బయటకు వస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!