Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఆస్పత్రి నుంచి తన భర్తను తీసుకెళ్లి సీక్రెట్‌గా వైద్యం చేయిస్తున్న శ్రీలక్ష్మీని బెదిరించి  ఎలాగైనా ఆ ప్లేస్‌ తెలుసుకోవాలని ప్రియంవద అనుకుంటుంది.శ్రీలక్ష్మీ రాకకోసం ఇంట్లో కాలుకాలిన పిల్లిలా తిరుగుతుంటుంది. ఎందుకు అంత కంగారుపడుతున్నావని తల్లి అడిగినా ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. ఇంతలో కాలేజీ నుంచి లక్ష్మీ, మ్యాడీ ఇంటికి వస్తారు. వచ్చీరాగానే ప్రియంవద శ్రీలక్ష్మీపై ఎగురుతుంది. ఎక్కడ నుంచి వస్తున్నావని నిలదీస్తుంది. దీంతో మ్యాడీ మేమిద్దరం కాలేజీ నుంచే వస్తున్నామని చెబుతాడు. ఇప్పుడు కాదురా ఉదయం ఇది కాలేజీకి రాకుండా ఎక్కడికి వెళ్లిందని అడుగుతుంది.తాను ఆస్పత్రికి వెళ్లానని చెప్పడంతో ప్రియంవద శ్రీలక్ష్మీపై మండిపడుతుంది.ఎవరిని అడిగి ఆస్పత్రికి వెళ్లావని....కాలేజీకి వెళ్లకుండా బయట తిరుగుళ్లు ఎందుకు తిరుగుతున్నావని గట్టిగా అరుస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యనారాయణ....నాకు చెప్పే ఆస్పత్రికి వెళ్లిందని అంటాడు. అయినా నీకు చెప్పి అన్నీ చేయాలా అని నిలదీస్తాడు.అది కాదు నాన్న అసలే అతన్ని మర్డర్ చేయబోయారని....ఇప్పుడు ఇలా అతని కోసం ఆస్పత్రులు చుట్టూ తిరుగుతుంటే మనకే రిస్క్ కదా అని అంటుంది. నువ్వు చెప్పింది మంచిదే అయినా...శ్రీలక్ష్మీ చేసింది అంతకన్నా మంచి పని అని అంటాడు.                 ఇంతలో శ్రీలక్ష్మీ కల్పించుకుని ఆయనపై కత్తితో దాడులు చేసిన వాళ్లు మళ్లీ ఆస్పత్రిలోనూ హత్య చేయడానికి ప్రయత్నించినట్లు ఉన్నారని....అందుకే ఆయన్ను  ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ ప్లేస్‌లో ఉంచి వైద్యం చేయిస్తున్నట్లు చెబుతుంది.  ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చెప్పమని ప్రియంవద అంటుంది. ఇంతలో మ్యాడీవాళ్ల నాన్న, బాబాయి కూడా కల్పించుకుని అతనిపై ఆస్పత్రిలోనూ దాడికి పాల్పడ్డారంటే....అతను చాలా డేంజర్‌లో ఉన్నాడని అంటారు. అందుకే మనం పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారని అంటారు. దీంతో ప్రియంవద కల్పించుకుని నువ్వు అతన్ని ఎక్కడ దాచావో చెబితే....అన్నయ్య వాళ్లు అతన్ని కాపాడి పోలీసులకు అప్పగిస్తారని చెబుతుంది. ఇప్పుడు అతనికి సేఫ్‌ ప్లేస్‌లోనే ఉంచి ట్రీట్‌మెంట్ చేయిస్తున్నానని....అతనికి నయంకాగానే ఇంటికి తీసుకొస్తానని చెబుతుంది. అప్పుడు మీరు అతన్ని తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయించండని అంటుంది.ఆ మాటలు విన్న ప్రియంవద గుండెల్లో రాయిపడినట్లు అవుతుంది. ముందు అతన్ని ఎక్కడ ఉంచావో చెప్పు ఆ తర్వాత అది మంచి ప్లేస్‌ అవునో కాదో మేం చూసుకుంటామని ప్రియంవద అడుగుతుంది. అత్తయ్య అన్ని సార్లు అడుగుతుంటే చెప్పడానికేంటని మ్యాడీ అంటాడు.ఇంట్లోవాళ్లకు కూడా చెప్పకూడని సీక్రెట్‌ ఏం ఉందని అంటాడు. అలాంటిదేమీలేదని శ్రీలక్ష్మీ చెప్పబోతుండగా....సూర్యనారాయణ అడ్డుపడి నువ్వు సీక్రెట్‌గా ఉంచావంటే అది మంచి ప్లేస్‌ అవుతుందని అంటాడు. ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని చెప్పి వెళ్లిపోతాడు.                        సింధూ  ఊరికి వెళ్లాలని గొడవ చేస్తుంటే...గోపీ వాళ్ల అమ్మను అడుగుతాడు.ఆమె ససేమీరా అంటుంది. మొన్ననే కదా వెళ్లి వచ్చారని అంటుంది. అయినా ఆ ముసలాయన నిన్ను కీలుబొమ్మను చేసి ఆడించాలని చూస్తుంటే....నీ పెళ్లం నీతో చీరలు కట్టించి తోలుబొమ్మలా ఆడిస్తుందని మండిపడుతుంది. మమ్మల్ని హనీమూన్‌కు పంపించడానికే పిలిపిస్తున్నారని చెప్పడంతో గోపీ వాళ్ల అమ్మ సంతోషంతో వెళ్లిరమ్మని చెబుతుంది. ఆ మాటలు విన్న సింధూజాక్షి గోపీపై మండిపడుతుంది.అలా చెబితేనే మా అమ్మ ఒప్పుకుంటుందని చెప్పానని చెబుతాడు.                       త్రిష మాటలు విన్న విక్రమ్‌...లక్ష్మీకి సారీ చెప్పడానికి వాళ్ల ఇంటికి వస్తాడు. బయట ఉండి లక్ష్మీకి ఫోన్ చేయగా...ఈ టైంలో ఎందుకు వచ్చారని ఆమె కోప్పడుతుంది. మిమ్మల్ని కలిసి సారీ చెప్పకపోతే నాకు నిద్రపట్టదని ఒకసారి బయటకు రమ్మని అడుగుతాడు. దీంతో శ్రీలక్ష్మీ విక్రమ్‌ను కలవడానికి బయటకు రాగా....ప్రియంవద చూసి వీడియో తీస్తుంది.