Jagadhatri Serial Today Episode: జేడీ ఎత్తుకు పైఎత్తు వేయడానికి మీనన్‌ పుల్లయ్య వేషయంలోనే వాళ్ల ఇంటికి వస్తాడు.అప్పుడే అక్కడ డ్రాగన్‌కు  జేడీ, కేడీ ఇద్దరూ జాగ్రత్తలు చెబుతుంటారు.ఇంతలో మీడియా వాళ్లు అక్కడికి రాగా...ఎందుకు వచ్చారని జేడీ అడుగుతుంది. ఈ మీరామీనన్‌ వాళ్ల భర్త రమ్మని ఫోన్ చేశాడని చెబుతారు. మీనన్ ఫోన్ చేశాడా అని అడిగితే కాదని...ఎవరో పుల్లయ్య అని చెబుతుండగానే మారువేషంలోఅక్కడికి వచ్చిన పుల్లయ్య ఈ మీరామీనన్‌ అసలు పేరు పెంటమ్మని అది నా భార్య అని చెబుతాడు.దీనికి డ్రాగన్ అసలు ఒప్పుకోదు. వీడు ఎవడో కూడా నాకు తెలియదని చెబుతుంది. అప్పుడే అతను తన ఒంటిమీద ఉన్న పుట్టుమచ్చలు చెబుతాడు. అవన్నీ జైలు రికార్డుల్లో ఉన్నవి తెలుసుకుని అక్కడ చెబుతాడు.అలాగే డ్రాగన్‌తో తీసుకున్న పెళ్లి ఫొటోలు చూపించి మాయ చేస్తాడు. ఇవి చూపించే కదా....ఆ మీనన్‌ భార్య అని అందరినీ నమ్మించింది అని అంటాడు. దీంతో జేడీకి విషయం అర్థమవుతుంది. లోపలికి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్లిన తర్వాత డ్రాగన్‌...పుల్లయ్యపై రంకెలేస్తుంది.ఎవడ్రా నువ్వు నా మొగుడని చెబుతున్నావని అరుస్తుంది. అప్పుడే జేడీ అసలు విషయం బయటపడుతుంది. ఇతనే మీనన్‌ అని చెప్పడంతో  డ్రాగన్ భయపడి వెనక్కి తగ్గుతుంది.

                  నేను ఈ కాంపౌండ్‌లో అడుగుపెట్టిన వెంటనే నువ్వు కనుక్కుంటావని నాకు తెలుసు జేడీ అని మీనన్ అంటాడు. ఈ ప్రపంచంలో నేను ఎలా ఉన్నా గుర్తుపట్టగలిగే ఏకైక వ్యక్తిని నువ్వేనని అంటాడు.మా సంగతి సరేగానీ...నీ బ్రెయిన్ కాస్త మొద్దుబారిందని జేడీ అంటుంది. నేను ఈ ప్లాన్ వేసి డ్రాగన్‌ను రంగంలోకి దింపిన వెంటనే నువ్వు కనిపెట్టేస్తావని అనుకుంటే.....మరీ ఇంత లేట్‌గా వచ్చావేంటని అంటుంది. అయినా నువ్వు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తున్న జేడీ ముందుకు వచ్చి కుప్పిగంతులు వేస్తున్నావేంటని కేదార్ అంటాడు. అయితే చుట్టూ చూసి మాట్లాడమని మీనన్ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ  ఉన్నది అంతా నా మనుషులేనని అంటాడు. ఆల్రెడీ మీనన్ చచ్చిపోయాడని మనమే చెప్పామని....ఇప్పుడు వీడిని తీసుకెళ్లి మీనన్ అని చెప్పినా ఎవరూ నమ్మరని జేడీ అంటుంది.కాబట్టి మనం వాడిని అరెస్ట్ చేయాలేమన్న ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నాడని అంటుంది. అందరి దృష్టిలో మీనన్ చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈ డ్రాగన్‌ను నేనే పెంటమ్మగా తీసుకెళ్తానని ఎవరు ఆపుతారో చూస్తానని అంటాడు. టెక్నికల్‌గా ఇప్పుడు నీపై నేనే గెలిచానని అంటాడు. డ్రాగన్‌ను రమ్మని గట్టిగా పిలిస్తే ఆమె వెనకడుగు వేస్తుంది. ఇప్పుడు నువ్వు వాడి వెంట వెళ్లడం తప్ప మరో మార్గంలేదని చెప్పి జేడీ డ్రాగన్‌ను మీనన్ వెంట పంపిస్తుంది. ఆమెను పెంటమ్మగా తన భార్యగా మీడియాకు చెప్పి కారులో ఎక్కించుకుని వెళ్లబోతాడు మీనన్‌..                              మీనన్ కారు దగ్గరకు వచ్చి ఆపుతుంది జేడీ....నా పరిధిలోకి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావ్ మీనన్ అని బెదిరిస్తుంది. మీడియా వాళ్లను పిలిచి ఈ మీరామీనన్‌ నిజంగానే మీనన్ భార్యని మా విచారణలో తేలిందని....అచ్చం ఈమె మాదిరిగానే జైలులో పెంటమ్మ అనే ఆవిడ ఉందని చెబుతుంది. దీంతో పుల్లయ్యగారు కన్ఫూజ్‌ అయి ఆమే ఈమె అనుకుని పొరబడ్డారని అంటుంది. కాదని పుల్లయ్య వాదించగా..అయితే జైలుకు వెళ్దాం పదండి అక్కడే అన్ని విషయాలు తేలతాయని చెబుతుంది. లేదంటే రెండురోజులు మీ ఆవిడ అని చెబుతున్న ఈవిడతో ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండండని సలహా ఇస్తుంది. నిజంగా ఆవిడ మీఆవిడే అయితే నిర్భయంగా తీసుకెళ్లవచ్చని చెప్పి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. మీడియా ఉండటంతో ఏం చేయలేక మీనన్‌కు డ్రాగన్‌ను తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు.                                     సురేష్‌ను కలుద్దామని పిలిచి జగధాత్రి, కేదార్ బయట కలుస్తారు. మీరు వదినను అపార్థం చేసుకుంటున్నారని జగధాత్రి అంటుంది. నా బిడ్డ కోసం నేను గిప్ట్‌ పంపిస్తే కూడా నేలకేసి కొట్టిందని అదంతా నేను వీడియోలో చూశానని చెబుతాడు. దీంతో అదంతా దివ్యాంక ఆడిన నాటకమని....అసలు గిప్ట్‌ నువ్వు పంపించిన విషయమే చెప్పకుండా దివ్యాంక వదినని రెచ్చగొట్టి అలా చేసిందని చెప్పడంతో సురేష్‌ బాదపడతాడు. పైగా కీర్తి బర్త్‌డేకు నిన్ను పిలవడానికి ఫోన్ చేస్తే...అప్పుడు మీ ఇంట్లోనే ఉన్న దివ్యాంక ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందని చెబుతుంది. పైగా నువ్వు ఆమె కాలికి మందురాస్తున్నది వీడియోకాల్‌లో వదినకు చూపించిందని చెప్పడంతో సురేష్ కొంత తగ్గుతాడు. అయితే కీర్తి బర్త్‌డేకు వస్తానని చెబుతాడు.