తెలంగాణ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంగళవారం (ఆగస్టు 30) ప్రకటించారు. ఉదయం 9:30 గంటలకు ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం వెబ్‌సైట్‌లో చూడొచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం లింక్
ఫలితాల కోసం వెబ్‌సైట్: https://tsbie.cgg.gov.in
తెలంగాణలో ఆగస్టు 1 నుంచి 10 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,34,329 మంది, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,13,267 మంది విద్యార్థులు హాజరయ్యారు
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలకు మొత్తం 9.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 7 నుంచి 24వ వరకు సెంకడ్ ఇయర్ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణులయ్యారు. రెగ్యూలర్ పరీక్షల్లో ఫెయిలైన వారికి ఆగస్టు 1 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను ఆగస్టు నెలాఖరులో విడుదల చేయనున్నారు.
Also Read:
HORTICET - 2022: ఏపీ హార్టీసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ - పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టీసెట్-2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టీసెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
NTR Health University: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలోని పారా మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..