తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్‌ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %),  మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి .


ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగింపు.


ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాం. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్ అనేది కీల‌క‌మైంది. జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ 9,45,153 మంది హాజ‌ర‌య్యారు. 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. 26 వేల మంది సేవ‌లందించారు. ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన అన్ని విభాగాల వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.


తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 


ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఏ జిల్లా టాప్‌- ఏ జిల్లా ఉత్తీర్ణత పడిపోయింది?
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఇవాళ (మే 9న) విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు. 
జిల్లాలవారీగా ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..