Telangana Inter Results 2023 Live Updates: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల- త్వరగా రిజల్ట్స్ రావాలంటే ఏబీపీ దేశం లింక్ క్లిక్ చేయండి

తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 09 May 2023 11:09 AM
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికే టాప్

ఇవాళ ఫస్ట్‌ ఇయర్‌ 4,33.82 మందికి 2.72,208 పాస్‌
ఏ గ్రేడ్‌ 1,60 వేల మంది 
బి గ్రేడ్‌ 68వేల 330 మంది పాస్‌ 
బాలికలు -2,17454 మందికి లక్షా 1,49729 మంది పాస్ 

విద్యార్థి దశకు ఇది టర్నింగ్ పాయింట్‌: సబితా

మార్చి 15 నుంచి పరీక్షలు జరిగాయి; సబితా
విద్యార్థి దశలో ఇది టర్నింగ్ పాయింట్‌:; సబితా
1473 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి; సబితా
15 స్పాట్ వాల్యూయేషన్ సెంటర్స్‌ ఏర్పాటు; సబితా

ఈ లింక్‌తో ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్‌ క్షణాల్లో మీ చేతిలో

ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫస్ట్‌ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గతేడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం రిజల్ట్స్‌ ఎలా ఉందీ?

గతేడాది ఫలితాలు చూస్తే...
ఇంటర్‌ రెండో సంవత్సరంలో 4లక్షల63వేల 370 మంది రాస్తే... 2లక్షల 95వేల 949 మంది పాస్‌ అయ్యారు. మొత్తంగా 67.82 శాతం పాస్‌ అయ్యారు. ఇందులో ఏ గ్రేడ్‌లో లక్షా 59వేల 422 మంది పాస్‌ అయితే... B గ్రేడ్‌లో 82వేల 481 మంది పాస్ అయ్యారు.  


ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను 2లక్షల 16వేల 389 మంది రాస్తే... లక్షా 64 వేల 172 మంది పాస్‌ అయ్యారు. 75.86శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 




ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను 2 లక్షల 19వేల  981 మంది రాస్తే... లక్షా 31వేల 277 మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల పాస్‌ పర్సంటేజ్‌ 60 శాతం. రెండో సంవత్సరంలో మేడ్చ్‌ల్‌ 78 శాతం పాస్‌తో మొదటి స్థానంలో ఉంటే.. 77శాతం పాస్‌ పర్సంటేజ్‌తో  ఆసిఫాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 


ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

Telangana Inter Exams Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్‌ పరీక్షల ఫలితాలు మే 9న వెల్లడికానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Background

Telangana Inter News: తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడికి సమయం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 9న‌ ఇంట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం ఫ‌లితాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. మే 9న ఉద‌యం 11 గంట‌ల‌కు నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నట్లు స‌మాచారం. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం ప‌రీక్షల‌కు 5 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇంట‌ర్ ఫ‌లితాల కోసం telugu.abplive.com tsbie.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు. 


తెలంగాణ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.


Also Read: జూన్‌ 11న 'మోడల్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష, దరఖాస్తు తేదీలివే?
ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభంకానుంది. మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థుల జాబితాను జూన్ 16న, సీట్లు పొందినవారి జాబితాను 18న ప్రకటించనున్నారు. జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక జూన్ 21 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


TS పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 


టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. 
ఎంసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.