Telangana Inter Exams 2022: అలర్ట్! తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ఇదే

Telangana Inter Board: సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు ఫస్ట్‌ ఇయర్, ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.

Continues below advertisement

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల (Telangana Inter Exams) నిర్వహణ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జేఈఈ అడ్వాన్స్ (JEE Advance) పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) ప్రకటించింది. బుధవారం ఇంటర్ బోర్డు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. అంతకుముందు తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ (Inter First Year Exams) పరీక్షలను ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు, సెకండ్ ఇయర్‌ పరీక్షలను (Inter First Second Year Exams) ఏప్రిల్‌ 21 నుంచి మే 5 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఏప్రిల్‌ 21న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. 

Continues below advertisement

ఈ సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు ఫస్ట్‌ ఇయర్, ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు ఉండనున్నాయి.

పరీక్షల పూర్తి టైమ్‌ టేబుల్‌.. (Inter Exams Time Table 2022)
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ.. (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)
ఏప్రిల్ 22 - పేపర్ - 1 తెలుగు/ సంస్కృతం
ఏప్రిల్ 25 - ఇంగ్లీష్ పేపర్ - 1
ఏప్రిల్ 27 - మాథ్స్ పేపర్ - 1A, బొటనీ పేపర్ - 1, పొలిటికల్ సైన్స్ పేపర్ - 1
ఏప్రిల్ 29 - మాథ్స్ పేపర్ - 1B జువాలజీ పేపర్ - 1, హిస్టరీ పేపర్ - 1
మే2 - ఫిజిక్స్ పేపర్ - 1, ఎకానమిక్స్ పేపర్ - 1
మే 6 - కెమిస్ట్రీ పేపర్ - 1, కామర్స్ పేపర్ - 1

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)
ఏప్రిల్ 23 - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్ - 2
ఏప్రిల్ 26 - ఇంగ్లిష్‌ పేపర్ - 2
ఏప్రిల్ 28 - మాథ్స్ పేపర్ - 2A, బోటనీ పేపర్ - 2, పొలిటికల్ సైన్స్ పేపర్ - 2
ఏప్రిల్ 30 - మాథ్స్ పేపర్ - 2B, జూవాలజీ పేపర్ - 2, హిస్టరీ పేపర్ - 2
మే 5 - ఫిజిక్స్ పేపర్ - 2, ఎకానమిక్స్ పేపర్ - 2
మే 7 - కెమిస్ట్రీ పేపర్ - 2, కామర్స్ పేపర్ - 2

Continues below advertisement
Sponsored Links by Taboola