తెలంగాణలోని డిగ్రీ విద్యలో కొత్తగా 'సైబర్ సెక్యూరిటీ' కోర్సును అందుబాటులోకి తెచ్చారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం (సెప్టెంబరు 11న) ప్రారంభించారు. ఉపాధికి, సమాజానికి అవసరయ్యే కొత్త కోర్సులను భవిష్యత్తులో మరిన్ని ప్రవేశ పెడతామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో ఐఎస్‌బీ రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు. బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు.
మూల్యాంకనంపై ఐఎస్‌బీ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేసి అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సైబర్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి ఎదుర్కొనేలా సైబర్ సెక్యూరిటీ కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీలో నాలుగో సెమిస్టర్‌లో సైబర్ సెక్యూరిటీని నాలుగు క్రెడిట్లతో ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, పలువురు వీసీ, ఐఎస్‌బీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ALSO READ:
విద్యార్థుల హాజరుకు 'ఫేస్ రికగ్నైజేషన్' విధానం, ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం' త్వరలోనే అమల్లోకి రానుంది. విద్యార్థుల హాజరునమోదుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. డీఎస్‌సీఎఫ్‌ఆర్‌సీ పేరిట ఈ యాప్‌ను వినియోగంలోకి తేనున్నారు. ఈ యాప్‌లో ఒకసారి విద్యార్థుల కన్ను, కనురెప్ప, ముక్కు వంటి 70 ఫేషియల్ పాయింట్లను నమోదు చేస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్, ఇంటర్ అర్హత చాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని 6 ప్రభుత్వ, 162 ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో జీఎన్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం సీటు కేటాయిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫ్రాన్స్‌లో చదవాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - 30 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం
భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతీ ఏటా వేలాది మంది విద్యార్థులు అనేక దేశాలకు వెళ్తుంటారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా.. ఇలా ఆయా దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఫ్రాన్స్‌కు వెళ్లి చదవాలి అనుకునే విద్యార్థులకు ఆ దేశ సర్కారు శుభవార్త చెప్పింది. 2030 నాటికి మన దేశం నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించగా.. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం పెంపొందించుకునే దిశగా అనేక చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ 30 వేల మంది భారతీయ విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అయితే అధ్యక్షుడి ఆదేశాలతో ఆ దేశ రాయబార కార్యాలయం కార్యాచరణ కూడా ప్రారంభించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..