Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(మార్చి15) నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బడులు నిర్వహిస్తారు. ఎండలు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మే మూడో వారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మధ్యాహ్నం గం.12.30లకు మిడ్ డే మీల్స్ అందిస్తామన్నారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా విద్యాశాఖ హాఫ్ డేస్ ప్రకటించింది. రేపటి నుంచి ఈ విద్యా సంవత్సవంలో చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు అంటే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొంది.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
తెలంగాణలో పదో తరగతి పరీక్షల(SSC Exams) షెడ్యూల్ విడుదల అయింది. మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు(SSC Board) ప్రకటించింది. మే 18 నుంచి 20వ తేదీ వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 9.30 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పదో తరగతి పరీక్షల తేదీలు
- మే 11వ తేదీ - ఫస్ట్ లాంగ్వేజ్ (ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు)
- మే 12వ తేదీ -సెకండ్ లాంగ్వేజ్ (ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు)
- మే 13వ తేదీ -థార్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) (ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు)
- మే 14వ తేదీ -మ్యాథమెటిక్స్ (ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు)
- మే 16వ తేదీ -జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్) (ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు)
- మే 17వ తేదీ -సోషల్ స్టడీస్ (ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు)
- మే 18వ తేదీ -ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1, (సంస్కృతం, అరబిక్) (ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు)
- మే 19వ తేదీ -ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్) (ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు)
- మే 20వ తేదీ -ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ) (ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు)