తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా 'టెట్‌' పరీక్ష నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి 'టెట్‌' అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించిన సంగతి తెలిసిందే.


ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్‌ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్‌ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్‌ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్‌ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్‌ ముడిపడి ఉంది.


రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్‌ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్‌ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు.


మూడేళ్లలో టెట్ అర్హత..
మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్‌ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్‌ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


ALSO READ:


యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
కేంద్రప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఖాళీల భర్తీకి సంబంధించి 2024 జాబ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబ‌ర్ 28న విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఏఏ ఉద్యోగాల‌కు ఎప్పుడు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తారో అన్న దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఏడాది యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుద‌ల చేస్తున్న విష‌యం తెల్సిందే. ఈ క్యాలెండర్ ప్రకార‌మే దేశ‌వాప్తంగా అభ్యర్థులు త‌మ ప్రిప‌రేష‌న్‌ను కొన‌సాగిస్తుంటారు.
యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..


కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..