TG 10th Supplementary Exam Schedule: తెలంగాణలో పదోతరగతి పరీక్షలు విడుదలైన మరుసటి రోజే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇప్పటికే జూన్‌లో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పుడు పరీక్షల తేదీలను అధికారులు వెల్లడించారు. జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు ఎగ్జామ్స్ జరపనున్నారు.   

Continues below advertisement

3 జూన్‌   ఫస్ట్‌ లాంగ్వేజ్‌4 జూన్   సెకండ్ లాంగ్వేజ్ 5 జూన్   థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లిష్) 6 జూన్   గణితం 9 జూన్   ఫిజికల్ సైన్స్‌10 జూన్  బయలాజికల్ సైన్స్ 11 జూన్  సోషల్ స్టడీస్ 12 జూన్  ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్ 113 జూన్  ఓఎస్‌ఎస్‌సీ మెయిన్  లాంగ్వేజ్‌ పేపర్ 2

ఏప్రిల్ 30న పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లతోపాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. ఈ సంవత్సరం, 4,96,374 మంది రెగ్యులర్ అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, 4,60,519 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, మొత్తం 92.78% ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలను క్లియర్ చేయలేని విద్యార్థులు మే 16లోపు పాఠశాలల ద్వారా మరోసారి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు మే 22లోపు తుది డేటా సమర్పించాలి.  ఫైన్‌తో కూడా ఈసారి ఫీజులు తీసుకోనున్నారు.  

Continues below advertisement