Telangana SSC Supplementary Result: తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఫలితాలను శుక్రవారం(జులై 7న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు గురువారం(జులై 6న) ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు జూన్ 14 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ అందుబాటులో ఉంచనున్నారు.
పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్..
పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇతర వెబ్‌సైట్..
ALSO READ:
డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో 'జాబ్' కోర్సులకే డిమాండ్, అత్యధికంగా భర్తీ అయిన సీట్లు అవే!
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో గత కొన్నేళ్లుగా కామర్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో అత్యధికంగా కామర్స్ సీట్లే భర్తీ అవుతున్నాయి. మరోవైపు లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. ఒకప్పుడు సైన్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు కామర్స్ కోర్సులకే బ్రహ్మరథం పడుతున్నారు. జూన్ 16న, 30న కేటాయించిన దోస్త్ మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. గత రెండేళ్లుగా కామర్స్‌వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఈ కోర్సు చేసిన దాదాపు 60 శాతం వరకు విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరంలోనూ డిగ్రీ కోర్సులో అడ్మిషన్లు తీసుకుంటున్నవారిలో ఎక్కువ మంది కామర్స్ కోర్సునే ఎంచుకుంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్, జేఈఈ మెయిన్ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్ మీటింగ్‌కు సంబంధించిన తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial