పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం పిన్ని సోదరి, తమ్ముడిని అత్యంత కర్కశంగా హత్యచేశాడు నిందితుడు. పిన్ని కుటుంబానికి సంబంధించిన వారిని పూర్తిగా తుదముట్టిస్తే ఆస్తి సొంతం చేసుకోవచ్చనే దుర్మార్గపు ఆలోచనతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళకు చెందిన షేక్ ఖాశీంకు ఇద్దరు కుమారులు వారి పేరు పెద మీరా సాహెబ్, చిన మీరా సాహెబ్. ఖాశీం ఇద్దరు కుమారులకు చెరి రెండెకరాల ఆస్తి ఇచ్చాడు. ఖాశీం మరణించాడు. కొంత కాలానికి ఇద్దరు అన్నదమ్ములు కుడా కాలం చేశారు. పెదమీరా సాహెబ్ పెద్ద కొడుకు ఖాశీం అతని కుమారుడు జాకీర్. ఇతని వాటాగా వచ్చిన పొలాన్నీ అప్పుల కారణంగా విక్రయించాడు. చినమీరా సాహెబ్ భార్య రహీమూన్ కు ముగ్గురు సంతానం. ఒక కుమార్తె ఇద్దరు కొడుకులు.. చిన మీరా సాహెబ్ మృతి చెందిన తర్వాత మగ్గురు బిడ్డలతో కలసి ధూళిపాళ్ళ లో నివసిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద కుమారుడు జబ్బార్ కరోనా సెకండ్ వేవ్ లో మృతి చెందాడు. రెండవ కుమారుడు రహిమాన్ సత్తెనపల్లిలో ప్రైవేట్ స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఉన్న రెండు ఎకరాల సాగు చేసుకుంటూ.. చిరు ఉద్యోగం చేస్తూ పరువుగా కుటుబాన్ని లాక్కొస్తున్మాడు.
కుటుంబాన్ని అంతం చేసేందుకు పథకం..
ఆప్పుల పాలై ఆస్తిని పోగొట్టుకున్న ఖాశీం తన చినాన్న ఆస్తిని కాజేయాలని మొదటి నుంచి దుర్భుద్దితో ఉన్నాడు. పిన్నమ్మ వద్దకు వచ్చి ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడు చనిపోయాడు కనుక ఆస్తిని రెండు బాగాలు చేసీ తనకు ఒక బాగాన్ని ఇవ్వాలని గొడవ పడేవాడు. చాలా సార్లు పిన్ని రహీమూన్ వద్దకు వచ్చి ఆస్తి తనకు కూడా ఇవ్వాలని గొడవ పడే వాడు. అస్తీ తన బిడ్డలకే చెందుతోందని కరాఖండిగా చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు ఖాశీం. పినతల్లి కుటుంబాన్ని అడ్డు తొలగించుకుంటే ఇక తనకు అడ్డు ఉండదని.. పిన్నమ్మ పిల్లలలో ఎవ్వరికీ పెళ్ళి కాలేదు కనుక వారసులు కూడా లేరని అడ్డు తప్పిస్తే వారి ఆస్తి తన సొంతమౌతుందని భావించాడు.
పిన్ని కుటుంబం మొత్తాన్ని హత మార్చేందుకు సిద్దమయ్యాడు. ఖాశీం తన కుమారుడు జాకీర్ తో కలసి ధూళిపాళ్ళ వెళ్ళాడు. పిన్ని రహిమూన్(65) వద్దకు వెళ్లాడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. అది చూసి భయంతో బయటకు వెళ్ళేదుకు ప్రయత్నించిన సోదరి మాలాంబి(36) గమనించి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.
ఆదే సమయంలో పెళ్లి కబురు చెప్పేందుకు మరో బందువు ఇంటికి వచ్చాడు. అలికిడి విన్న కాశీం అతని కుమారుడు వెనుక డోర్ నుంచి పరారు అయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని హాస్పటల్ కు తరలించేందుకు స్థానికులు ప్రయత్నించారు. రహీమూన్ అప్పటికే మృతి చెందింది. మాలింబీనీ సత్తనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. అప్పటి వరకు ఇద్దరు మాత్రమే హత్య అయినట్లు భావించారు.
నిందితుడు కాశీం తన పిన్నమ్మ కుమారుడు రహెమాన్ కూడా హత్య చేస్తే ఆ కుటుంబంలో మరెవ్వరూ ఉండరని అతనిని చంపేందుకు దారి కాచాడు..రెహమాన్ కు ఫేన్ చేసి మాట్లాడు కుందాం రమ్మని పిలిచాడు. నిజమని నమ్మి ఈద్గా దగ్గరకు వెళ్ళాడు. రహమాన్ రాగానే మాట్లాడు తున్నట్లు నటిస్తూ ఒక్క సారిగా తన కుమారుడితో కలిసిదాడి చేసి గొంతు పిసికి చంపాడు ఖాశీ. రహమాన్ మృత దేహాన్ని గోతాంలో కుక్కి పొదలలో పడేశాడు.
నిందితుల కోసం గాలింపు..
హత్య జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థాలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఈ లోపు గోనె సంచిలో మృత దేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. మృత దేహం రెహమాన్ ది గుర్తించారు. స్థానికుల నుంచి, బంధువుల నుంచి సమాచారం సేకరించి ఆస్తి కోసం జరిగిన హత్యగా కేసు నమోదు చేశారు. ఆస్తి కోసం మూడు హత్యలు జరిగినాయని తెలియడంతో ఒక్కసారిగా జిల్లా వారసులలో ఆందోళన నెలకొంది. ఈ రోజు పల్నాడు ఎస్పీ హత్య జరిగిన ధూళిపాళ్ళ గ్రామానికి వచ్చి హత్య జరిగిన తీరు తదితర వివరాలు స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం స్పెషల్ టీం ఏర్పాటు చేశామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేవిధంగా సాక్షాలను, ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు.