ANGRAU: ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రోగ్రామ్‌‌లో ప్రవేశాలు

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

Continues below advertisement

గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్(బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా(హోమ్ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు తమ దరఖాస్తులను జులై 17 వరకు సంబంధిత చిరునామాకు పంపించాలి. ఇంటర్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 

Continues below advertisement

ప్రోగ్రామ్ వివరాలు..

* బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్

కోర్సు వ్యవధి: నాలుగు సంవత్సరాలు.

కళాశాల: కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, లాం, గుంటూరు.

అర్హత: ఇంటర్మీడియట్(బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా(హోమ్ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000; ఇతరులకు రూ.2000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

చిరునామా: The Registrar, Acharya N.G. Ranga Agricultural University,
                     Administrative Office, Lam, Guntur - 522 034, A.P.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.07.2023.

Notification

Website

ALSO READ:

బాస‌ర ఆర్జీయూకేటీ తొలి ఎంపిక జాబితా విడుద‌ల‌, 1404 మంది విద్యార్థులకు ప్రవేశాలు!
బాస‌ర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల‌కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా జులై 3న విడుద‌లైంది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన విద్యార్థుల జాబితాను అందుబాటులో ఉంచారు. తొలిదశలో మొత్తం 1404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీకిలో ఓపెన్ కేట‌గిరిలో 640 మంది విద్యార్థులు, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 118 మంది, బీసీ కేట‌గిరిలో 346 మంది, ఎస్సీ కేట‌గిరిలో 178 మంది, ఎస్‌టీ కేట‌గిరిలో 119 మంది విద్యార్థులు ఎంపిక‌య్యారు. తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థుల‌కు జులై 7 నుంచి 9 వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. జాబితాలో 1వ నెంబరు నుంచి 500 వ‌ర‌కు జులై 7న, 501 నుంచి 1000 వ‌ర‌కు జులై 8న, 1001 నుంచి 1404 వ‌రకు జులై 9న కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. అలాగే దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు జులై 14న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ఎన్‌సీసీ, క్యాప్ విభాగాలకు చెందినవారికి జులై 15న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు యూనివ‌ర్సిటీ అధికారులు వెల్లడించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola