తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి. జులై 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. జులై 9న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు గడువును జులై 12 వరకు పొడిగించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. అదేవిధంగా జులై 21 నుంచి ప్రారంభంకావాల్సిన రెండోవిడత కౌన్సెలింగ్ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇక ఆగస్టు 2 నుంచి ప్రారంభంకావాల్సిన తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది. 


కౌన్సెలింగ్ వెబ్‌సైట్..


ఎంసెట్ కౌన్సెలింగ్ కొత్త షెడ్యూలు ఇలా..


మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ జులై 7 - జులై 8 వరకు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది.


➥ జులై 9: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.


➥ జులై 9 - జులై 12: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ (వెబ్‌ఆప్షన్స్)ఎంచుకోవాల్సి ఉంటుంది.


➥ జులై 12: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.


➥ జులై 16: సీట్ల కేటాయింపు.


➥ జులై 16 – 22: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ జులై 24 – జులై 25: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).


➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌.


➥ జులై 24 – జులై 27: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.


➥ జులై 27: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.


➥ జులై 31: సీట్ల కేటాయింపు.


➥ జులై 31 – ఆగస్టు 2 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ ఆగ‌స్టు 8: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).


➥ ఆగ‌స్టు 5: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌. 


➥ ఆగ‌స్టు 4 - ఆగ‌స్టు 6 వరకు: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.


➥ ఆగ‌స్టు 6: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.


➥ ఆగ‌స్టు 9: సీట్ల కేటాయింపు.


➥ ఆగ‌స్టు 9 – ఆగ‌స్టు 11: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


స్పాట్ ప్రవేశాలు...


స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial