తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణతతో పాటు, ఏపీ ఈఏపీసెట్-2023 ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, సీట్ల వివరాలు..
⏩ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్(బీఎస్సీ-ఎన్): 100
⏩ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ): 50
⏩ బీఎస్సీ అనెస్తీషియా టెక్నాలజీ(ఏటీ): 12
⏩ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ): 20
⏩ బీఎస్సీ రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజీ (ఆర్‌ఐటీ): 09
⏩ బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02
⏩ బీఎస్సీ ఈసీజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ: 08
⏩ బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ (డీటీ): 12
⏩ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ: 04
⏩ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 04
⏩ బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ(ఆర్‌టీ): 05
⏩ బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ: 02
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు (బీపీటీ కోర్సు నాలున్నరేళ్లు).
అర్హత: 45శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణతతో పాటు, ఏపీ ఈఏపీసెట్-2023 ర్యాంకు సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2360. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు రూ.1888.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్-2023 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.08.2023.
➥ తాత్కాలిక మెరిట్ జాబితా ప్రదర్శన: 16.08.2023.
➥ ఇమెయిల్ ద్వారా / వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరణ: 18.08.2023.
➥ తుది మెరిట్ జాబితా ప్రదర్శన: 21.08.2023.
➥ ఒకటో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 26.08.2023.
➥ తరగతుల ప్రారంభం: 31.08.2023.
ALSO READ:
సీపెట్ చెన్నైలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశాలు
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్), స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా (మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, పాలిమర్, ప్లాస్టిక్స్) లేదా ఐటీఐ (ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 03 వరకు అవకాశం ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీటు కేటాయిస్తారు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.
నల్సార్ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial