GATE Exam 2022: 'విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేం..' గేట్ పరీక్ష వాయిదాకు సుప్రీం నో

ABP Desam Updated at: 03 Feb 2022 03:36 PM (IST)
Edited By: Murali Krishna

ఫిబ్రవరి 5న జరగనున్న గేట్ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. విద్యార్థులను గందరగోళ పరిస్థితుల్లోని నెట్టలేమని సుప్రీం వ్యాఖ్యానించింది.

గేట్ పరీక్ష వాయిదాకు సుప్రీం నో

NEXT PREV

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఫిబ్రవరి 5న గేట్ పరీక్ష జరగనుంది. 20వేల మంది విదార్థులకుపైగా పరీక్షను వాయిదా వేయాలని ఆన్​లైన్ పిటిషన్​లో సంతకాలు చేశారు. దీని ఆధారంగా సుప్రీంలో వ్యాజ్యం దాఖలైంది.కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని పరీక్షను వాయిదా వేయాలని వీరు పిటిషన్‌లో పేర్కొన్నారు. 


జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.








పరీక్షకు ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో పరీక్షను వాయిదా వేస్తే విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. విద్యార్థుల భవిష్యత్తుతో మేం ఆడుకోలేం.                                - సుప్రీం ధర్మాసనం


గేట్ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.


గేట్‌ పరీక్ష నిర్వహణకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండటంతో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్‌ వినియోగించాలని సూచించింది. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


దేశవ్యాప్తంగా 200పైగా కేంద్రాల్లో ఫిబ్రవరి 5, 6, 12,13 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.


Also Read: Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'


Also Read: India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. తాజాగా 1,72,433 మందికి కరోనా

Published at: 03 Feb 2022 01:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.