దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేవశాలకు నిర్వహించే 'సీయూఈటీ' ప్రవేశపరీక్ష జరిగే తేదీల్లోనే ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సీయూఈటీ పరీక్షలు మే 21 నుంచి 31 వరకు జరగనుండగా ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మే 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 19తో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ముగిశాయి. ఇక బైపీసీ స్ట్రీమ్ (అగ్రికల్చర్ & ఫార్మసీ) పరీక్షలు మే 22, 23 తేదీల్లో జరుగనున్నాయి. అదేవిధంగా ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీయూఈటీ పరీక్షలు మే 21న ప్రారంభమై నుంచి జూన్ 2 వరకు; అదేవిధంగా జూన్ 5, 6 తేదీల్లో జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో మే 22, 23న జరిగే ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీయూఈటీ పరీక్షలు రాయడం కుదరడంలేదు. దీంతో సీయూఈటీ పరీక్షలు కూడా రాయాలనుకునే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈఏపీసెట్ పరీక్షలు వాయిదావేయాలని అభ్యర్థిస్తున్నారు.
మరోవైపు ' సీయూఈటీ-2023' పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21 నుంచి జూన్ 2వ తేదీ వరకు; అదేవిధంగా.. జూన్ 5, 6 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతానికి మే 21, 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను మాత్రమే ఎన్టీఏ విడుదల చేసింది. మిగతా తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.
CUET UG - 2023 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
Also Read:
బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలివే!
కోల్‌కతాలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజెబిలిటీస్' 2023 విద్యా సంవత్సరానికిగాను బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 'కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఏఎల్‌డీ(కోల్‌కతా), ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్(కటక్), ఎన్‌ఐఈపీఎండీ(చెన్నై), పీడీయూఎన్‌ఐపీపీడీ(న్యూఢిల్లీ)లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్!
తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 9లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నిఫ్టెమ్‌లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హరియాణా(సోనిపట్)లోని ''నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (నిఫ్టెమ్)'' సంస్థ 2023-2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించాను. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..