SVVU MVSC Admissions: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 సీట్లను భర్తీ చేయనున్నారు. బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌తో పాటు ఐకార్ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్)- 2023 ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 3 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐకార్ ఏఐఈఈఏ(పీజీ)- 2023 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, కౌన్సెలింగ్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
* ఎంవీఎస్సీ కోర్సు
సీట్ల సంఖ్య: 80.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
విభాగాలు: యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ A.H. ఎక్స్‌టెన్షన్ అండ్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ &ఒబెస్ట్ట్రిక్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ &టాక్సికాలజీ, వెటర్నరీ ఫిజియాలజీ, వెటర్నరీ ఫిజియాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ.
విభాగాల వారీగా సీట్లు..
1. యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్: 06
2. యానిమల్ న్యూట్రిషన్: 05
3. లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్: 04
4. లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ టెక్నాలజీ: 03
5. పౌల్ట్రీ సైన్స్: 03
6. వెటర్నరీ అనాటమీ: 04
7. వెటర్నరీ అండ్ A.H. ఎక్స్‌టెన్షన్ అండ్ ఎడ్యుకేషన్: 04
8. వెటర్నరీ బయోకెమిస్ట్రీ: 04
9. వెటర్నరీ గైనకాలజీ &ఒబెస్ట్ట్రిక్స్: 06
10. వెటర్నరీ మెడిసిన్: 06
11. వెటర్నరీ మైక్రోబయాలజీ: 05
12. వెటర్నరీ పారాసైటాలజీ: 04
13. వెటర్నరీ పాథాలజీ: 05
14. వెటర్నరీ ఫార్మకాలజీ &టాక్సికాలజీ: 04
15. వెటర్నరీ ఫిజియాలజీ: 03
16. వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ: 05
17. వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ: 09
ఎస్.వీ.వీ.యూ కింద ఉన్న సంస్థలు..
కాలేజీలు..
1. వెటర్నరీ సైన్స్ కళాశాల, తిరుపతి, తిరుపతి జిల్లా
2. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం, కృష్ణా జిల్లా
3. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు, Y S R కడప జిల్లా
4. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గరివిడి, విజయనగరం జిల్లా
5. కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ, తిరుపతి, తిరుపతి జిల్లా
అనుబంధ కాలేజీ..
➥ పైడా కాలేజ్ ఆఫ్ డైరీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, పటావల, తూర్పు గోదావరి జిల్లా
అర్హత: బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌తో పాటు ఐకార్ ఏఐఈఈఏ(పీజీ)- 2023 ర్యాంకు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 21.05.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఐకార్ ఏఐఈఈఏ(పీజీ)- 2023 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, కౌన్సెలింగ్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: SVVU, Administrative Office, Dr.Y.S.R. Bhavan, Tirupati – 517 502.
ముఖ్యమైన తేదీలు...
* నోటిఫికేషన్ వెల్లడి: 21.05.2024.
* దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 03.06.2024.
* కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన: 07.06.2024.
* కౌన్సెలింగ్ తేదీ: 11.06.2024.
* 2023-24 విద్యాసంవత్సరం మొదటి సెమిస్టర్ కోసం రిజిస్ట్రేషన్: 14.06.2024.