తెలంగాణలోని రామగుండంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలో 7 సీట్ల కోసం సింగరేణి ఉద్యోగుల పిల్లలు జులై 14 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సంస్థ సంచాలకుడు ఎన్.బలరామ్ తెలిపారు. నీట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారని, ఉద్యోగుల పిల్లలు వారి తల్లి లేదా తండ్రి పని చేస్తున్న గని లేదా విభాగం అధిపతి నుంచి నిర్దేశిత నమూనాలో ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొచ్చి సమర్పించాలన్నారు.
రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరిగింది.
నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్, ఈ మేరకు వారి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సింగరేణి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ:
ఇంటర్‌లో బైపీసీనా, ఎంబీబీఎస్ సీటు రాకపోయినా సరే - మరెన్నో కోర్సులున్నాయి!
ఇంటర్ లో బైపీసీ తీసుకొని.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా మంది విపరీతంగా భయపడిపోతుంటారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ లో సీటు రాకపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. బీఏఎంస్, బీహెచ్ఎంఎస్, బీడీఎఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో చేరుతుంటారు. మరికొంత మంది విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తుంటారు. కానీ ఇంటర్ లో బైపీసీ చదివి ఎంబీబీఎస్ యే కాకుండా ఆ తర్వాత చదివేందుకు అనేక కోర్సులు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎంబీబీఎస్, బీడీఎస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం (జులై 7) ప్రారంభించింది. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు. జనరల్ క్యాటగిరీకి, ఈడబ్ల్యూఎస్ కోటాకు 137 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆయా క్యాటగిరీల్లోని దివ్యాంగులకు 107 మార్కులు (40 శాతం), జనరల్ క్యాటగిరీ దివ్యాంగులకు 121 మార్కులు (45 శాతం) కటాఫ్‌గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజును జనరల్, బీసీ క్యాటగిరీ విద్యార్థులు రూ.3,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,900 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎంబీబీఎస్ స్థానికేతర సీట్లు ఏపీ విద్యార్థులకే! తెలంగాణలోనూ స్థానికులకే!
రాష్ట్ర విభజన జరిగిన (2014 జూన్ 2) తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడ్(స్థానికేతర) సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీచేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏసీఆర్, పద్మావతి, గాయత్రీ, నిమ్రా, బాలాజీ, విశ్వభారతి, అపోలో కళాశాలల్లో, ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా వచ్చిన మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, రాజమహేంద్రవరం, ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని అన్ని సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేసేలా ఉత్తర్వులు రానున్నాయి. దీనివల్ల సుమారు 200 ఎంబీబీఎస్ సీట్లు స్థానిక కోటాలో అదనంగా వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం విభజన తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని అన్ని సీట్లను తమ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial