School Holidays in Telangana: తెలంగాణలోని పాఠశాలలకు వరుసగా మూడురోజులపాటు సెలవులు రానున్నాయి. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డిసెంబరు 24 నుంచి 26 వరకు క్రిస్మస్ సెలవులు ఉండనున్నాయి. ఇందులో డిసెంబరు 24 క్రిస్మస్ ఈవ్, 25 క్రిస్మస్‌‌‌ డేతోపాటు డిసెంబరు 26న బాక్సింగ్ డే సెలవు దినంగా ఉండనున్నాయి. క్రిస్మస్ పండగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని చాలా పాఠశాలలు మూడురోజులు సెలవులు ఇస్తుండగా.. మరికొన్ని పాఠశాలలు కేవలం డిసెంబరు 25న మాత్రమే సెలవుగా ప్రకటించాయి. క్రిస్మస్ పండగ మరుసటిరోజు బాక్సింగ్‌ డేగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని స్కూల్స్ డిసెంబరు 26న కూడా సెలవుదినంగా ప్రకటించాయి. అయితే డిసెంబరు 24న పలు స్కూళ్లకు ఆప్షనల్ హాలీడేగా ఉంటుంది. ఇక డిసెంబర్ 26న బాక్సింగ్ దినోత్సవం జరుపుకుంటారు. ఇది సాధారణ సెలవు దినంగా పరిగణిస్తారు.


2024-25 స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలోని క్రిస్టియన్ విద్యాసంస్థలకు డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మస్ సెల‌వులు ప్రకటించారు. ఇక ఏపీలో స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు డిసెంబరు 20 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తున్నారు. ఇతర విద్యాసంస్థలకు డిసెంబరు 25న క్రిస్మస్ హాలీడేగా ప్రకటించారు. ఆప్షనల్ హాలీడేగా డిసెంబరు 26న ప్రకటించే అవకాశం ఉంది. 


వచ్చే ఏడాది 2025కు గానూ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో మొత్తం 27 సాధారణ సెలవులు ఉండగా, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 


తెలంగాణలో సాధారణ సెలవులు 2025..



  1. నూతన సంవత్సరం- 1 జనవరి 2025 బుధవారం

  2. భోగి 13 జనవరి 2025- సోమవారం

  3. సంక్రాంతి 14 జనవరి 2025- మంగళవారం 

  4. రిపబ్లిక్ డే 26 జనవరి 2025- ఆదివారం

  5. మహా శివరాత్రి 26 ఫిబ్రవరి- బుధవారం

  6. హోళీ 14 మార్చి 2025- శుక్రవారం

  7. ఉగాది 30 మార్చి 2025- ఆదివారం

  8. రంజాన్ 31 మార్చి 2025- సోమవారం

  9. రంజాన్ మరుసటిరోజు 1 ఏప్రిల్ 2025- మంగళవారం

  10. బాబు జగ్జీవన్ రాం జయంతి 5 ఏప్రిల్ 2025- శనివారం

  11. శ్రీరామనవమి 6 ఏప్రిల్ 2025- ఆదివారం

  12. అంబేద్కర్ జయంతి 14 ఏప్రిల్ 2025- సోమవారం

  13. గుడ్ ఫ్రైడే 18 ఏప్రిల్ 2025- శుక్రవారం

  14. బక్రీద్ 7 జూన్ 2025- శనివారం

  15. మోహర్రం 6 జులై 2025- ఆదివారం

  16. బోనాలు 21 జులై 2025- సోమవారం

  17. స్వాతంత్య్ర దినోత్సవం 15 ఆగస్ట్ 2025- శుక్రవారం

  18. శ్రీ కృష్ణాష్టమి 16 ఆగస్ట్ 2025- శనివారం

  19. వినాయక చవితి 27 ఆగస్ట్ 2025- బుధవారం

  20. ఈద్ మిలాద్ ఉన్ నబి 5 సెప్టెంబర్ 2025- శుక్రవారం

  21. బతుకమ్మ ప్రారంభం 21 సెప్టెంబర్ 2025- ఆదివారం

  22. గాంధీ జయంతి/దసరా 2 అక్టోబర్ 2025- గురువారం

  23. దసరా మరుసటిరోజు 3 అక్టోబర్ 2025- శుక్రవారం

  24. దీపావళి 20 అక్టోబర్ 2025- సోమవారం

  25. 25. కార్తీకపూర్ణిమ, గురునానక్ జయంతి 5 నవంబర్ 2025- బుధవారం

  26. 26. క్రిస్టమస్ 25 డిసెంబర్ 2025- గురువారం

  27. 27. బాక్సింగ్ డే 26 డిసెంబర్ 2025- శుక్రవారం


ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఉన్న అధికారిక సెలవులు ఇవే..



  1. భోగి - జనవరి 13  సోమవారం

  2. మకర సంక్రాంతి - జనవరి 14  మంగళవారం

  3. కనుమ-  జనవరి 15 బుధవారం

  4. రిపబ్లిక్‌ డే - జనవరి 26  ఆదివారం

  5. మహాశివరాత్రి - ఫిబ్రవరి 26  బుధవారం

  6. హోలీ - మార్చి 14  శుక్రవారం

  7. ఉగాది - మార్చి 30  ఆదివారం

  8. రంజాన్ -  మార్చి 31  సోమవారం

  9. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి - ఏప్రిల్ 5  శనివారం

  10. శ్రీరామనవమి - ఏప్రిల్ 6  ఆదివారం

  11. బీఆర్ అంబేడ్కర్ జయంతి -  ఏప్రిల్ 14  సోమవారం

  12. గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 18  శుక్రవారం

  13. బక్రీద్ - జూన్ 7  శనివారం

  14. మొహర్రం - జులై 6  ఆదివారం

  15. వరలక్ష్మీవ్రతం - ఆగస్టు 8  శుక్రవారం

  16. స్వాతంత్య్ర దినోత్సవం - ఆగస్టు 15  శుక్రవారం

  17. శ్రీకృష్ణాష్టమి - ఆగస్టు 16  శనివారం

  18. వినాయకచవితి - ఆగస్టు 27  బుధవారం

  19. మిలాద్ ఉన్నబీ - సెప్టెంబరు 5  శుక్రవారం

  20. దుర్గాష్టమి - సెప్టెంబరు 30  మంగళవారం

  21. విజయదశమి -  అక్టోబరు 2  గురువారం

  22. గాంధీ జయంతి - అక్టోబరు 2  గురువారం

  23. దీపావళి - అక్టోబరు 20  సోమవారం

  24. క్రిస్మస్ - డిసెంబరు 25 గురువారం